Home » radish
ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇదే మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. మూత్రవ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ముల్లంగి జీర్ణ క్రియలను వేగవంతం చేయటంలో తోడ్పడుతుంది. దీనిలో కరిగే ఫైబర్ అధికంగా ఉండటంతో మలాన్ని మృదువుగా మార్చటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే వోలాటైల్ అయిల్స్ వల్ల పైల్స్ వల్ల కలిగి మంట, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ముల్లంగి ఆకులు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే డైటరీ కంటెంట్ డైటేరియన్ అలసటను నివారిస్తుంది.
దంతాలు పసుపు రంగులోకి మారుతున్నట్లయితే, ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిపై నిమ్మరసం వేసి దంతాల మీద రుద్దండి. ఇది పసుపు రంగును తొలగిస్తుంది.