Home » Rayalaseema Lift Irrigation Scheme
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. జస్టిస్ కె. రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు.
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. పోతిరెడ్డిపాడును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.
తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు పలికారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు.
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని అన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలజగడం ముదురుతోంది. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మండిపడుతోంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ కుడి కాల్వ నిర్మాణాలను వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్వహించాలని �