Home » Ridge Gourd Farming
వరి, పత్తి, నిమ్మలాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన బీరసాగు చేపడుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో స్వల్ప నీటి వినియోగంతో.. అధిక దిగుబడులను సాధిస్తూ.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
బీర.. తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్కు తరలించవచ్చు.
తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెరియాకుళం నుండి విడుదలయిన రకం, కాయలు 60-70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, తొడిమ భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం: 130 రోజులు దిగుబడి : 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.