Luffa Cultivation : బీరసాగుతో అధిక లాభాలు పొందుతున్న నెల్లూరు జిల్లా రైతు

వరి, పత్తి, నిమ్మలాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన బీరసాగు చేపడుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో స్వల్ప నీటి వినియోగంతో.. అధిక దిగుబడులను సాధిస్తూ.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 

Luffa Cultivation : బీరసాగుతో అధిక లాభాలు పొందుతున్న నెల్లూరు జిల్లా రైతు

Luffa Cultivation

Updated On : July 22, 2023 / 10:34 AM IST

Luffa Cultivation : వరి, పత్తి , నిమ్మ సాగుకు పేరుగాంచిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో..  ప్రత్యామ్నాయ పంటలపైనా ఆసక్తి కనబరుస్తున్నారు రైతులు. ఎప్పుడూ వేయని తీగజాతి కూరగాయ పంటలను సాగు చేసి సక్సెస్‌ అవుతూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే సాగు చేసిన రైతులు లాభాలు బాగున్నాయని చెప్తుండడంతో ఉద్యాన అధికారులు కూడా  ఆయా పంటల సాగుకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

READ ALSO : Cotton Cultivation : ఎత్తు మడులలో.. పత్తిసాగు ఎంతో మేలు

ఎంతో మంది రైతులు దశాబ్దాలుగా సంప్రదాయ పంటలు సాగుచేస్తూ.. అధిక దిగుబడులు సాధించలేక నష్టాల పాలవుతున్నారు. మరోవైపు ఒకే రకమైన పంట వేయడం వల్ల మార్కెట్ లో గిట్టుబాట ధర లభించక సతమతమవుతున్నారు. ఈ  తరుణంలో కొంత మంది మాత్రం విభిన్న పంథాలో ముందడుగు వేసి సరికొత్త సాగుకు శ్రీకారం చుడుతున్నారు.

READ ALSO : Diseases in Groundnut : వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు.. అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ

ఈ కోవలోనే నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలోని రైతులు వరి, పత్తి, నిమ్మలాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన బీరసాగు చేపడుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో స్వల్ప నీటి వినియోగంతో.. అధిక దిగుబడులను సాధిస్తూ.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.  అయితే ఉద్యానశాఖ సబ్సిడీలను అందిస్తే మరికొంత మంది కూరగాయల సాగుచేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందంటున్నారు.