Home » Small onion
ఉల్లి పంట వెయ్యడానికి ముందునేలను దమ్ము చేసుకోవాలి. ఆఖరిగా దుక్కి అయిపోయాక భూమిని చిన్న, చిన్న మడులుగా విభజించాలి. నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి.
నీరు నిలువని సారవంతమైన ఎర్రనేలలు, మెరకనేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల ఇసుక నేలలు అనుకూలం. చౌడు,క్షారత్వం, నీరు నిలువ ఉండే భూములు పనికిరావు. ఉదజని నూచిక 5.8-5.5 ఉన్న నేలలు అనువైనవి.
కలుపు తీసిన ప్రతి సారి మొక్కచుట్టూ మట్టిని ఎగదోసి,పెరిగే గడ్డలకు ఎండ తగలకుండా చూడాలి. ఎండ తగిలితే గడ్డలు ఆకుపచ్చగా మారి తినడానికి వీలుకావు. నాటిన 75 రోజులకు మాలిక్ హైడ్రాజైడ్ (2.5 గ్రా/లీ.) పిచికారి చేస్తే నిల్వలో గడ్డలు మొలకెత్తడం తగ్గుతుంది.