Home » Sonusood Twitter
కరోనా మహమ్మారి మనుషులపై దండెత్తితే మనుషులలో కొందరు వారి గొప్ప మనసు చాటుకొని మహానుభావులయ్యారు. అందులో సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి సోనూసూద్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది.
ఒకప్పుడు సోనూసూద్ అంటే క్రూరమైన విలన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. కానీ గతేడాది కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో ఎందరో దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు.