Home » Symptoms and Causes
ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు రెండు డోసుల టీకాలను వేయించాలి.
బరువు తగ్గాలన్న ప్రయత్నం చేయకుండానే అనుహ్యంగా ఒకేసారి బరువు తగ్గితే ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఊహించని విధంగా బరువు తగ్గడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు ప్రారంభ సంకేతంగా అనుమానించాలి.
అస్పష్టమైనమాటలు, మాట్లాడే పదాలలో పొందికలేవటం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్‌కు ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు. ఒక సాధారణ వాక్యాన్ని తిరిగి మాట్లాడమని అడిగిన సందర్భంలో అతను మాట్లాడటానికి ఇబ్బందిపడితే అది స్ట్రోక్ కావచ్చు.
నిశ్చల జీవనశైలి ఫలితంగా భుజం నొప్పి మహిళల్లో పెరుగుతోంది. ఎక్కువ గంటలు డెస్క్ వర్క్ చేయడం వల్ల , వ్యాయామాలు చేయకపోవటం వల్ల భుజం కండరాలు బలహీనపడతాయి. తగినంత కదలిక, శక్తి లేకపోవడం భుజం కీలుపై ఒత్తిడిని కలిగుతుంది.