Home » The Enforcement Directorate
అక్రమ మైనింగ్ విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులకు ఒక నిందితుడి నివాసంలో రెండు ఏకే-47 రైఫిళ్లు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ భారత జవాన్లకు చెందినవని పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన బెంగాలీ నటి అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందిందని ఈడీ తెలిపింది. అందుకే ఆమెకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.
పాత్రా చాల్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా రూ.11.15 కోట్ల విలువైన వర్షా రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ రౌత్‌ను ఆదివారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కు చెందిన రూ. 110 కోట్ల విలువైన వివిధ రకాలైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం అటాచ్ చేసింది. వీటిలో భూములు, భవనాలు, షేర్ హోల్డింగ్స్, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభర�
‘ద ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ నిబంధనలు ఉల్లంఘించి విదేశాల నుంచి నిధుల సేకరణ, దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడ్డందుకుగాను ఈడీ జరిమానా విధించింది. అక్రమాలకు పాల్పడ్డందుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.
కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్‌లు కూడా తప్పని తెలిసింది.