Home » Tips for Protecting Crops from Heavy Rains
పెరుగుదల దశలో వరి పైరు నీటిముంపుకు గురైతే పొలంలో ముంపునీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. ఎకరానికి 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్ ఎరువులు పైపాటుగా వేయాలి. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది
పంట నాశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా నోవాల్యురాన్ 0.75మి.లీ వంటి కీటక నాశిని మందులను పిచికారి చేయాలి.