Home » TTD
ఈ నెల 27 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ సూచించింది.
టీటీడీ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ కు చెందిన నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. దర్శనం టికెట్ కోసం సిబ్బంది రూ.10వేలు డిమాండ్ చేశారన్న నటి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆమె ఆరోపణల్లో నిజం లేదంది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సేలం వినియోగదారుల కోర్టులో షాక్ తగిలింది. ఓ భక్తుడికి టీటీడీ వస్త్రం సేవా టికెట్ కేటాయించలేకపోవడంతో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని లేదంటే సేవా దర్శన భాగ్యం కలిగించాలని ఆదేశించింది. సేలానికి చెందిన హరి భాస్�
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా తిరుమల వచ్చి సంప్రదాయంగా లంగాఓణిలో వచ్చి స్వామివారిని దర్శించుకుంది. జాన్వీ తిరుమలలో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా శుక్రవారం జాన్వీ కపూర్ తన స్నేహితురాళ్ళతో కలిసి లంగాఓణిలో తిరుమలకు వచ్చింది జాన్వీ కపూర్. సంప్రదాయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంది..............
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తుల సమక్షంలోనే జరగనున్నాయి.
తిరుమల తిరుపతిలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్ ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్ల�
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది.
తిరుమల రావాలనుకుంటున్న భక్తులకు టీటీడీ బోర్డు ఒక సూచన చేసింది. రాబోయే ఐదు రోజులు రద్దీ పెరగనుండటంతో దివ్యాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.