Sravana Upakarma : శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది.

Sravana Upakarma : శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

sravana upa karma

Updated On : August 12, 2022 / 4:34 PM IST

Sravana Upakarma :  తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం శ్రీ కృష్ణ‌స్వామి వారిని శ్రీ భూవ‌ర‌హ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకువ‌చ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకించారు.

అనంతరం స్వామివారికి నూత‌న య‌జ్ఞోప‌వీతాన్ని స‌మ‌ర్పించి, ఆస్థానం నిర్వహించారు. అనంత‌రం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.