Home » Twitter chief Elon Musk
ప్రస్తుతం తొలగించిన 4,400 మందికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట.
ట్విటర్లో పలువురు నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో.. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాంగింగ్ సైట్ పనితీరు నిదానంగా ఉండటంతో మస్క్ స్పందించారు. ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలియజేశాడు.
ట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుంది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల వేతనం చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వ