శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం గోశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.
రుతువుల రాణీ ‘వసంత’కాలం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ వచ్చిందంటే కోకిలమ్మ కమ్మని పాటలు, చిగుర్లతో పచ్చగా కళకళలాడే చెట్లు, రంగు రంగుల పూలతో పరిమళాల గుభాళింపు ఇలా ‘ఉగాది’ విశిష్టితలు ఎన్నో ఎన్నెన్నో..
మనిషి జీవితం సుఖ దు:ఖాల మేలు కలయిక.అలాగే ఉగాది పండుగ రోజున అత్యంత ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడి కూడా షడ్రుచుల మేలు కలయిక. మన జీవితం షడ్రుచుల సమ్మేళనం అనేదానికి సూచనే ఈ ఉగాది పచ్చడి చెప్పే సత్యం. ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి. అంటే ఆరు రుచులు ఉ�
ప్రకృతిమాత వసంతరుతువు ఆగమనంతో పచ్చటి చీర చుట్టుకుంటుంది. ఉగాది పండగతో వసంత రుతువు ఆరంభం అవుతుంది. అటువంటి ఉగాది పండుగ విశిష్టత గురించి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
‘ఉగాది’ని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటూ సంవత్సర (తెలుగు సంవత్సరం) ప్రారంభం అని అర్థం. వసంతమాసంలో వస్తుందీ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?