Home » Vaikuntha Ekadashi celebrations
విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శ్రీనివాసుడి సుందర రూపాన్ని చూసి భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని అర్చకులు అలంకరించారు.
ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ మంత్రులు, స్వాములవారిని దర్శించుకున్నారు.
Vaikunta Ekadasi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు తరలివస్తున్నారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం క