Home » Warm Water
డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా వేడినీళ్లు రక్షిస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు సేవించటం అలసటను తగ్గిస్తుంది, శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా రోగ నిరోధకతను మెరుగుపరుస్తుంది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందుతుంది.