Home » Westminster Abbey
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాచరిక సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాణి అంత్యక్రియల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
ఇటీవల మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరగబోతున్నాయి. దీనికోసం బ్రిటన్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలు హాజరవుతున్నందున వారి భద్రత, ఇతర అవసరాల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నారని సమాచారం.
ప్రిన్స్ ఫిలిప్ను పెళ్లిచేసుకున్న చర్చిలోనే క్వీన్ ఎలిజబెత్ ఆఖరి మజిలీ పూర్తి అవుతుంది. 13 ఏళ్ల వయస్సులో గ్రీస్, డెన్మార్క్ మాజీ రాకుమారుడు ఫిలిప్ మౌంట్ బాటన్ ప్రేమలో పడ్డారు ఆమె. ఫిలిప్ను ఆమె మొదటిసారి 1934లో కలిశారు. ఫిలిప్ బ్రిటిషర్