Home » YS Sharmila criticized KCR
ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఏమయ్యాయో నోరు విప్పి కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు.
అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు. పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. బిక్షం ఇస్తున్నట్లు కేసీఆర్ బియ్యం ఇస్తున్నారని వెల్లడించారు.
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదన్నారు.