Apple iPhone 11 Deal : ఆపిల్ ఐఫోన్ 11పై అద్భుతమైన డీల్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైన ధరకే సొంతం చేసుకోండి..!

Apple iPhone 11 Deal : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11 అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఐఫోన్ 11లో కొన్ని అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి.

Apple iPhone 11 Deal : ఆపిల్ ఐఫోన్ 11పై అద్భుతమైన డీల్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైన ధరకే సొంతం చేసుకోండి..!

Apple iPhone 11 deal will save you thousands; check discounts and offers here

Apple iPhone 11 Deal : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఆపిల్ ఐఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 సరసమైన ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 11లో కొన్ని అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్ప్లేను కలిగి ఉంది. 12MP లెన్స్‌లు, 12 MP ఫ్రంట్ కెమెరాతో డ్యూయల్-సెట్ కెమెరాతో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. 128GB స్టోరేజీని అందిస్తుంది. A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 11 తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 11 ధర రూ. 48,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 44,999కు అందిస్తుంది. అంటే.. 7 శాతం తగ్గింపును అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందడం ద్వారా ఐఫోన్ 11 ధరను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!

ఐఫోన్ 11పై బ్యాంక్ ఆఫర్లు :
మీరు రూ.15వేల నుంచి రూ.39,999 మధ్య ధరలో ఆర్డర్‌లపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై ఫ్లాట్ రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తగ్గింపు పొందవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తగ్గింపు పొందవచ్చు. రూ.1000 నుంచి రూ.10వేల వరకు అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై పొందవచ్చు.

Apple iPhone 11 deal will save you thousands; check discounts and offers here

Apple iPhone 11 Deal will save you thousands; check discounts and offers here

మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా మీ ఐఫోన్ 11 ధరను కూడా తగ్గించవచ్చు. మంచి వర్కింగ్ కండిషన్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండాలి. ఎక్స్ఛేంజ్ వాల్యూ ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. మీ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.35వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా వివిధ డిస్కౌంట్లను పొందవచ్చు.

Read Also : Ducati Panigale V4R : బైక్ అంటే ఇది భయ్యా.. డుకాటీ ఫ్లాగ్‌షిప్ సూపర్‌స్పోర్ట్ కొత్త బైక్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?