Ducati Panigale V4R : బైక్ అంటే ఇది భయ్యా.. డుకాటీ ఫ్లాగ్‌షిప్ సూపర్‌స్పోర్ట్ కొత్త బైక్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Ducati Panigale V4R : డుకాటీ ఫ్లాగ్‌షిప్ పానిగేల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. సూపర్‌స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ రేస్-స్పెక్ అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ షెల్‌తో డెవలప్ చేసిన స్పెషల్ ఆయిల్‌తో స్పెషిఫికేషన్లతో 240.5bhpని ఉత్పత్తి చేస్తుంది.

Ducati Panigale V4R flagship supersport motorcycle launched in India at Rs 69.99 lakh
Ducati Panigale V4R : ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ డుకాటీ (Ducati) భారత మార్కెట్లో పానిగేల్ V4 R మోడల్ బైకును లాంచ్ చేసింది. ఈ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ పానిగేల్ రేంజ్ హాలో ప్రొడక్టు, 6వ గేర్‌లో 16,500rpm వద్ద 218bhp ఉత్పత్తి చేసే 998cc V4 ఇంజన్‌తో వస్తుంది. ఈ బైకు ధర రూ. 69.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. Panigale V4 R నిర్దిష్ట మార్పులతో ప్రామాణిక Panigale V4 వలె అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది.
సస్పెన్షన్ అనేది మాన్యువల్‌గా కంట్రోల్ చేసే సెటప్ ఓహ్లిన్స్, ముందువైపు NPX25/30, వెనుకవైపు TTX36 కలిగి ఉంది. బ్రేకింగ్ బ్రెంబో స్టైల్మా బ్రేక్‌ల ద్వారా ఆపరేట్ అవుతుంది. 193.5 కిలోల బరువును కలిగి ఉంటుంది. మోటార్‌సైకిల్ ఏరోడైనమిక్స్ పాత మోడల్ కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. వింగ్స్ సహా ఎక్కువ భాగం బాడీవర్క్ కార్బన్ ఫైబర్‌తో తయారైంది. డుకాటీ గత ఏడాదిలో MotoGP, WSBK ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. ఆధిపత్యాన్ని సూచించడానికి మోటార్‌సైకిల్ ఫ్రంట్ సైడ్ ‘1’ని కలిగి ఉంది.
2023 Ducati Panigale V4 Rకు పవర్ ఇచ్చేలా 998cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ R మోటార్ కలిగి ఉంది. ఈ 4-సిలిండర్ ఇంజన్ 6వ గేర్‌లో 16,500rpm (తక్కువ గేర్‌లలో 16,000rpm) వరకు ఉంటుంది. 218bhpని బయటకు శక్తిని పంపుతుంది. ఈ శక్తిని ఐచ్ఛిక అక్రాపోవిక్ రేసింగ్ ఫుల్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో 237bhpకి పెంచవచ్చు. డుకాటి కోర్స్‌తో అభివృద్ధి చేసిన షెల్ ఆయిల్‌తో 3.5bhp యాడ్ చేస్తుంది. మొత్తం పవర్ అవుట్‌పుట్ 240.5bhpకి చేరుకుంటుంది.

Ducati Panigale V4R flagship supersport motorcycle launched in India at Rs 69.99 lakh
Panigale V4 R V4లో అందించే పవర్ మోడ్‌ల విస్తరణతో వస్తుంది. ఇందులో ట్రాక్ ఎవో డిస్‌ప్లే, ప్రతి గేర్‌కు కాలిబ్రేషన్‌తో కూడిన ఇంజిన్ మ్యాప్‌లు, మెరుగైన డుకాటి ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్ సిస్టమ్ ఉన్నాయి. పవర్ మోడ్‌లలో కొత్త పవర్ మోడ్ లాజిక్ స్ట్రాడేల్ R మోటార్‌లో కాలిబ్రేషన్‌లతో వస్తుంది. ఇంజిన్ ఫుల్, మీడియం, హై, లో వంటి మోడ్ కలిగి ఉంది.
ఈ పానిగేల్ V4R బైకు ధర రూ. 69.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. భారత మార్కెట్లో ఇతర డుకాటి మోడల్‌ల మాదిరిగా కాకుండా ఇటలీ నుంచి CBUగా వచ్చింది. అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కారణంగా బైకు ధర రూ. 10.24 లక్షలు పెరిగింది.