Moto E13 Launch In India : 5,000mAh భారీ బ్యాటరీతో మోటో E13 వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 8న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto E13 Launch In India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Moto E13 వచ్చేస్తోంది. ఫిబ్రవరి 8న భారత మార్కెట్లోకి Moto E13 లాంచ్ కానుంది. ఇప్పటికే యూరోప్‌లోని మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికాలోని ఎంపిక చేసిన మార్కెట్‌లలో అందుబాటులోకి వచ్చింది.

Moto E13 Launch In India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Moto E13 వచ్చేస్తోంది. ఫిబ్రవరి 8న భారత మార్కెట్లోకి Moto E13 లాంచ్ కానుంది. ఇప్పటికే యూరోప్‌లోని మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికాలోని ఎంపిక చేసిన మార్కెట్‌లలో అందుబాటులోకి వచ్చింది. Motorola బడ్జెట్-ఫ్రెండ్లీ E సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త మోడల్ అని చెప్పవచ్చు. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 8న భారత్‌లో అందుబాటులోకి రావొచ్చునని నివేదిక తెలిపింది

ఈ మోడల్ 4GB RAMతో పాటు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుందని టిప్‌స్టర్ పేర్కొంది. ముఖ్యంగా, ఇతర దేశాల్లో లాంచ్ అయిన Moto E13 మోడల్ 2GB RAMని కలిగి ఉంది. అయితే, దీని ధర EUR 119.99 (దాదాపు రూ. 10,700)గా ఉంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ ప్రకారం.. Moto E13 ఫోన్ మోడల్ ధర రూ. 10వేల లోపు ధర ఉంటుందని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే ఇతర మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. 2GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 119.99 (దాదాపు రూ. 10,700) వరకు ఉంటుంది.

Moto E13 With 5,000mAh Battery, 4GB of RAM Tipped to Launch in India

Read Also : DigiLocker : డిజిలాకర్ అంటే ఏంటి? డిజిటల్ వ్యాలెట్‌లో అథెంటికేషన్ డాక్యుమెంట్లను ఎలా యాక్సస్ చేసుకోవాలో తెలుసా?

Moto E13 HD+ (720×1,600 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T606 SoCతో పాటు Mali-G57 MP1 GPUని అందిస్తుంది. భారత్ వేరియంట్ 4GB RAMతో వస్తుందని శర్మ సూచిస్తున్నారు. కెమెరాల పరంగా పరిశీలిస్తే.. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ వెనుక 13-MP ప్రైమరీ కెమెరా ఉండనుంది. Moto E13 ఫ్రంట్ సైడ్ 5-MP సెల్ఫీ కెమెరాను కూడా ఉంది.

64GB స్టోరేజీ కలిగిన ఈ ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా (1TB వరకు) స్టోరేజీని విస్తరించుకోవచ్చు. Moto E13 ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది. గరిష్టంగా 36 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని నివేదిక పేర్కొంది. Moto E13 ఫోన్ 10W వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది. చివరిగా ఈ హ్యాండ్‌సెట్ డెస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌ను అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G నెట్‌వర్క్ ఉందంటే? ఇదిగో ఫుల్ లిస్టు.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు