జియో టు వోడాఫోన్ ఐడియా : చీపెస్ట్.. బెస్ట్ ప్రీపెయిడ్ డేటా ప్లాన్లు ఇవే

Reliance Jio-Airtel-VI Affordable prepaid plans : ప్రముఖ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం చీపెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. కాలింగ్, డేటాతో పాటు ఎస్ఎంస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. రోజూ 2GB డేటా కావాలనుకునే మొబైల్ యూజర్లు.. కొత్త డేటా ప్లాన్లపై 28 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.

ఇటీవలే ఎయిర్ టెల్ అమెజాన్ భాగస్వామ్యంతో కొన్ని ప్లాన్లపై ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. వోడాఫోన్ ఐడియా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్‌పై Voot Select భాగస్వామ్యంతో OTT బెనిఫిట్స్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ మూడు టెలికం దిగ్గజాలు రూ.250లోపు అందించే చీపెస్ట్ డేటా ప్లాన్లలో ఏయే ప్లాన్లలో డెయిలీ డేటా, కాలింగ్, స్ట్రీమింగ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఎయిర్ టెల్ : రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్ టెల్ అందించే ఈ ప్లాన్ కింద రోజూ 1GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 24రోజుల వ్యాలిడిటీతో 100 SMS లు పొందవచ్చు. దీనికి అదనంగా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. అలాగే ఎయిర్ ఎక్స్ ట్రీమ్ ప్రీమియం కూడా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు. ఇంకా Wynk మ్యూజిక్, Shaw Academy కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

ఎయిర్ టెల్ : రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ఎయిర్ టెల్ ప్లాన్ కింద రోజుకు 1GB డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. అదనంగా మరెన్నో డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

ఎయిర్ టెల్ : రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద రోజుకు 1.5GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. ఉచితంగా హోలో ట్యూన్స్, అలాగే FASTag ట్రాన్సాక్షన్స్ చేస్తే రూ. 150 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

జియో : రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీతో 28GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. 300 SMS ఉచితంగా పొందవచ్చు. అలాగే కాంప్లమెంటరీ సబ్ స్ర్కిప్షన్ కింద జియో యాప్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

జియో : రూ. 185 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద 28 రోజుల కాలపరిమితిపై 28GBడేటా, అన్ లిమిటెడ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 300 ఉచితంగా ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. అలాగే కాంప్లమెంటరీ సబ్ స్ర్కిప్షన్ కింద జియో యాప్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

జియో : రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ :
రిలయన్స్ జియోలో మరో ఆఫర్ రూ.199 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 42GB డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5GB డేటాను పొందవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ డొమెస్టిక్ కాల్స్ కూడా పొందవచ్చు. రోజుకు 100 ఉచితంగా ఎస్ఎంఎస్ లతో పాటు జియో యాప్స్ కంప్లిమెంటరీ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.

జియో రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద జియో రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 100 SMSలు, కంప్లిమెంటరీ సబ్ స్ర్కిప్షన్ కింద జియో యాప్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

వోడాఫోన్ ఐడియా (Vi) : రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీ కింద రోజుకు 1GB డేటాను పొందవచ్చు. రూ.125 ప్లాన్ కింద MPL (మొబైల్ ప్రీమియర్ లీగ్) ఫేవరేట్ గేమ్స్ యాక్సస్ చేసుకోవచ్చు. అలాగే బోనస్ క్యాష్ కూడా పొందవచ్చు. జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినవారికి రోజుకు రూ.75 వరకు ప్లాట్ డిస్కౌంట్ కూడా సొంతం చేసుకోవచ్చు. Vi Movies, TV షోలను కూడా Voot Select ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు