UPI Credit Card Payments : గూగుల్ పే, పేటీఎం యూజర్లు.. ఇకపై యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసుకోవచ్చు..!

UPI Credit Card Payments : డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే ఇప్పటివరకూ యూపీఐ ద్వారా బ్యాంకు అకౌంట్లతో పేమెంట్లు చేసుకోవచ్చు. అయితే, ఇకపై యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసుకోవచ్చు.

UPI Credit Card Payments : డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే ఇప్పటివరకూ యూపీఐ ద్వారా బ్యాంకు అకౌంట్లతో పేమెంట్లు చేసుకోవచ్చు. అయితే, ఇకపై యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసుకోవచ్చు. UPIలో పేమెంట్లు చేసే విధానాన్ని మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పేమెంట్ అగ్రిగేటర్‌ల భాగస్వామ్యంతో ప్లాట్‌ఫారమ్‌లో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రారంభించింది.

UPI పేమెంట్లను మరింత సజావుగా చేసేందుకు యూజర్లకు మరిన్ని ఆప్షన్లను అందిస్తుంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డ్‌ని వాడేందుకు ఇష్టపడే వారికి సాయపడుతుంది. UPI ఆధారిత యాప్‌లలో లేటెస్ట్ అప్‌డేట్ ఎప్పుడు కనిపిస్తుందో ఇంకా తెలియదు. UPI పేమెంట్లలో రూపే క్రెడిట్ కార్డ్‌ (Rupay Credit Card)లను RBI సులభతరం చేసిన కొద్ది రోజుల తర్వాత తాజాగా ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చింది.

BharatPe, క్యాష్‌ఫ్రీ పేమెంట్లు, Google Pay, Razorpay, Paytm, PayU, పైన్ ల్యాబ్‌లు వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లింపులు చేసేందుకు అంగీకరించాయి. ఇప్పటివరకు ఒక ఆప్షన్ కాదనే చెప్పాలి. నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం వినియోగదారులకు స్వల్పకాలిక క్రెడిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అందించే రివార్డ్‌ల బెనిఫిట్స్ పొందడంలోనూ సాయపడుతుంది.

Read Also : Moto G Stylus 5G : ట్రిపుల్ కెమెరాలతో మోటో G Stylus 5G ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

ప్రస్తుతానికి, బ్యాంకు అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లు, ప్రీపెయిడ్ అకౌంట్లను ఉపయోగించి మాత్రమే లావాదేవీలు చేసే వీలుంది. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌లు UPIకి లింక్ చేసిన పేమెంట్లు చేయడానికి ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు క్రెడిట్ కార్డ్‌లను తమతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

UPI Credit Card Payments _ Google Pay, Paytm, and more to enable credit card transactions on UPI

UPI, లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అనేది ఎలాంటి బ్యాంక్ అకౌంట్ వివరాల అవసరం లేకుండా తక్షణమే బ్యాంకు అకౌంట్ల మధ్య నగదును బదిలీ చేసుకోవచ్చు. భారత్‌లో ప్రతి నెలా డిజిటల్ యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లో 8 బిలియన్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డ్ లావాదేవీలు తరచుగా అధిక పరిమాణాలతో ముడిపడి ఉంటాయి.

విస్తృత శ్రేణి లావాదేవీల కోసం ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. తద్వారా భారత్‌లో డిజిటల్ చెల్లింపులను కూడా పెంచుతుందని భావిస్తున్నారు. పేమెంట్లు చేయడానికి వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని, ఆప్షన్ అందిస్తుంది. దేశంలో డిజిటల్ పేమెంట్లను స్వీకరించే అవకాశం ఉంది. 250 మిలియన్లకు పైగా వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు పేమెంట్లు కోసం UPIని ఉపయోగిస్తున్నారని ఓ నివేదిక చెబుతోంది.

ఈ ఏడాది జనవరిలో UPIని ఉపయోగించి దాదాపు 8038.59 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. దాదాపు రూ. 1,299,058.78 కోట్లు. క్రెడిట్ కార్డులతో రానున్న నాలుగేళ్లలో లావాదేవీల సంఖ్య 16 శాతం పెరుగుతుందని RBI అంచనా వేస్తోంది. ‘టార్గెటెడ్ రెగ్యులేషన్స్ ద్వారా ప్రీమియర్ ఇన్నోవేషన్‌లో ఎంపిక చేసిన కొన్ని దేశాలలో భారత్ ఒకటి. అందుకే, UPI లావాదేవీల్లో RuPay క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయాలని RBI నిర్ణయం తీసుకుంది.

Read Also : Mercedes-AMG GT 63 SE : మెర్సిడెస్-బెంజ్ GT 63 SE హైబ్రిడ్ మోడల్ కారు.. ఏప్రిల్ 11న సూపర్ సెడాన్ వచ్చేస్తోంది..!

ట్రెండింగ్ వార్తలు