Hyderabad : డబ్బు అడిగిన యువతికి కోరిక తీర్చాలని వేధింపులు, ఆ తర్వాత వీడియోలు చూపి.. హైదరాబాద్‌లో దారుణం

Hyderabad : తమతో కూడా గడపాలని యువతికి వీడియోలు పంపారు నిందితుడి స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలిని బెదిరించారు.

Hyderabad : డబ్బు అడిగిన యువతికి కోరిక తీర్చాలని వేధింపులు, ఆ తర్వాత వీడియోలు చూపి.. హైదరాబాద్‌లో దారుణం

call money like incident in hyderabad

Hyderabad – Call Money : హైదరాబాద్ లో కాల్ మనీ తరహా ఘటన వెలుగుచూసింది. అప్పు తీర్చకపోవడంతో తన కోరికను తీర్చాలని బాధితురాలిపై యువకుడు ఒత్తిడి తెచ్చాడు. గత్యంతరం లేక యువకుడితో ఉండేందుకు అంగీకారం తెలిపిందా యువతి. ఆమెకు తెలియకుండా రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు నిందితుడు.

మరుసటి రోజు తన స్నేహితులకు ఆ వీడియోలు చూపించాడు నిందితుడు. తమతో కూడా గడపాలని యువతికి వీడియోలు పంపారు నిందితుడి స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలిని బెదిరించారు. యువతి అంగీకరించకపోవడంతో వీడియోలు వైరల్ చేశారు నిందితులు. మానసిక క్షోభ భరించలేకపోయిన బాధితురాలు షీ టీమ్స్ ను ఆశ్రయించింది. షీ టీమ్స్ నుంచి వివరాలు తీసుకున్న నారాయణగూడ పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.(Hyderabad)

పోలీసులు తెలిపిన వివరాలు..
బాధితురాలికి నిందితుడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. తనకు డబ్బు కావాలని యువతి అడిగింది. ఆమె అడిగినట్లు అతడు డబ్బు ఇచ్చాడు. అయితే తిరిగి డబ్బు చెల్లించలేకపోయింది. దాంతో తన కోరిక తీర్చాలని యువకుడు వేధించాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. అయితే, నిందితుడు దాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోలను చూసిన నిందితుడి స్నేహితులు.. తమ కోరిక కూడా తీర్చాలని యువతిని వేధించారు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు.

Also Read..Hyderabad : బాబోయ్.. పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో అశ్లీల చిత్రాలు.. హైదరాబాద్‌లో కలకలం, అసలేం జరిగిందంటే

అన్నట్టే యువకులు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతిని వేధించిన అస్లాం అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కాల్ మనీ తరహాలో ఈ దారుణం జరిగిందా? మరో కారణం ఏదైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో పరిచయమైన యువకులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపుతోంది. ఈ కేసులో అస్లాం అనే యువకుడు కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు.(Hyderabad)

బాధితురాలికి.. ఇన్ స్టాగ్రామ్ లో అస్లాం పరిచయం అయ్యాడు. తనకు డబ్బు కావాలని అస్లాంను యువతి అడిగింది. తన స్నేహితుడు సాయిచరణ్ దగ్గర డబ్బులు ఉన్నాయని, అతడితో ఒకరోజు గడిపితే కచ్చితంగా డబ్బు సాయం చేస్తాడని ఆ యువతితో అస్లాం చెప్పినట్లు పోలీసులు విచారణలో తేలింది.

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

పోలీసులు ఏమన్నారంటే..
బాధితురాలికి 7 నెలల క్రితం చెన్నైకి చెందిన బీటెక్ ఫైనలియర్ విద్యార్థి యాదవ్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. యువతి హైదరాబాద్ నారాయణగూడలో ఎంబీఏ ఫస్టియర్ చదువుతోంది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతంలో తనకు పరిచయం ఉన్న అస్లాంను డబ్బు కావాలని యువతి అడిగింది. అయితే, తన దగ్గర డబ్బులు లేవు లేని, నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయని, అతడితో ఒకరోజు రూమ్ షేర్ చేసుకుంటే డబ్బులు ఇస్తాడని చెప్పాడు. అందుకు యువతి ఒప్పుకుంది.

సాయిచరణ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లింది. దీన్ని అస్లాం వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వీడియోను యువతికి పంపిన అస్లాం ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఇదంతా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత యువతి బాయ్ ఫ్రెండ్ పూర్ణేష్ యాదవ్.. యువతి ఫోన్ తీసుకుని చూడగా, అందులో వీడియో క్లిప్ కనిపించింది. ఇలా ఎందుకు చేశావు? ఈ వీడియోని నీ బంధువులకు పంపిస్తాని బాయ్ ఫ్రెండ్ యాదవ్ యువతిని బెదిరించాడు.(Hyderabad)

Also Read..Mumbai College girl : విద్యార్థినిని రేప్ చేసి హత్య..! కాలేజీ హాస్టల్లో దారుణం

తన లవర్ చర్యతో భయపడిపోయిన యువతి.. షీటీమ్స్ ను ఆశ్రయించింది. అస్లాం, సాయిచరణ్, బాయ్ ఫ్రెండ్ పూర్ణేశ్ యాదవ్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అస్లాంను అదుపులోకి తీసుకున్నాం. అతడి ఫోన్ సీజ్ చేశాం.