Mumbai College girl : ముంబయి కాలేజీ హాస్టల్లో దారుణం
ముంబయి నగరంలోని ప్రభుత్వ హాస్టల్ లో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. హాస్టల్ గార్డు ఈ దురాగతానికి పాల్పడ్డాడని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు...

Mumbai College girl murdered
Mumbai College girl murdered: మహారాష్ట్రలోని ముంబయి నగరంలో దారుణం జరిగింది. ముంబయి నగరంలోని మెరైన్ డ్రైవ్ (Marine Drive)ప్రాంతంలోని ప్రభుత్వ వసతి గృహంలోని ఓ గదిలో 18 ఏళ్ల కళాశాల విద్యార్థిని మృతదేహం లభించడం సంచలనం రేపింది. హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేశారని ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ ముంబైలోని పోలీస్ జింఖానా సమీపంలో ఉన్న సావిత్రి ఫూలే మహిళా హాస్టల్‌లో 15 ఏళ్లుగా గార్డుగా పనిచేస్తున్న ఓంప్రకాష్ కనౌజియా పరారీలో ఉన్నాడని, ఆపై శవమై కనిపించాడని పోలీసులు చెప్పారు.
Cyclone Biparjoy : పాకిస్థాన్‌లో తీరం దాటనున్న బీపర్‌జోయ్ తుపాన్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు
చర్ని రోడ్ స్టేషన్ వెనుక మెరైన్ డ్రైవ్‌లో ఉన్న ఉమెన్స్ హాస్టల్ నాల్గవ అంతస్తులోని ఆమె గదిలో 18 ఏళ్ల యువతి మృతదేహాన్ని గుర్తించారు.తాము సంఘటనా స్థలానికి చేరుకుని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ముంబయి డీసీపీ ప్రవీణ్ ముండే చెప్పారు. మృతి చెందిన కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టమైన సమాచారం వస్తుందని పోలీసులు చెప్పారు.
Virginia Shooting : వర్జీనియా హైస్కూల్‌లో కాల్పులు..ఏడుగురికి గాయాలు
బాధితురాలు సబర్బన్ బాంద్రాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థిని.గదిలోకి ప్రవేశించిన పోలీసు బృందం బాధితురాలు మెడకు దుపట్టా బిగించి ఉండటం చూశారు.హాస్టల్‌లో పనిచేస్తున్న గార్డు ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని అదనపు కమిషనర్ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు.మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో సమీపంలోని రైల్వే స్టేషన్‌లో అనుమానితుడు ప్రకాష్ రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు.అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీటీ ఆస్పత్రికి తరలించారు.