Cyclone Biparjoy : పాకిస్థాన్‌లో తీరం దాటనున్న బీపర్‌జోయ్ తుపాన్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

బీపర్‌జోయ్ తుపాన్ రానున్న 24 గంటల్లో పాకిస్థాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం విడుదల చేసిన తన బులెటిన్‌లో పేర్కొంది.ఈ తుపాను ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది....

Cyclone Biparjoy : పాకిస్థాన్‌లో తీరం దాటనున్న బీపర్‌జోయ్ తుపాన్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

Cyclone Biparjoy

Cyclone Biparjoy : అరేబియా సముద్రంలో ఏర్పడిన బీపర్‌జోయ్ తుపాన్ రానున్న 24 గంటల్లో పాకిస్థాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.(landfall in Pakistan)మంగళవారం ఉదయం 8:30 గంటల సమయానికి కరాచీకి దక్షిణంగా 1,490 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం నెలకొని ఉంది.ఈ తుపాన్ ప్రభావం వల్ల ముంబయిలో రుతుపవనాలపై పడుతుందని(Affect Monsoon in Mumbai) వాతావరణశాఖ అధికారులు చెప్పారు.ఈ తుపాను ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Major Train Accident Averted: డ్రైవర్ బ్రేక్ వేయడంతో తప్పిన పెద్ద రైలు ప్రమాదం

‘‘తుపాను వచ్చినప్పుడల్లా, అది రుతుపవనాల ఆగమనాన్ని ప్రభావితం చేస్తుందని, దీనివల్ల రుతుపవనాలు రెండు రోజులు ఆలస్యం కావచ్చు’’ అని ముంబయి ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధిపతి సునీల్ కాంబ్లే తెలిపారు.మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరో 24 గంటల్లో తీర ప్రాంతాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య అరేబియా సముద్రం, ఉత్తర గుజరాత్ తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.ముంబయిలో ప్రస్తుతం రుతుపవనాల ప్రారంభం ఆలస్యం అవుతోంది. దీని వల్ల ఏడు వేర్వేరు సరస్సుల నుంచి మంచినీటిని సరఫరా చేయనున్నారు. జూన్ 30 వతేదీ వరకు సరిపడా మంచినీరు రిజర్వాయర్లలో ఉన్నందున ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెప్పారు.

Odisha train accident: గాలిలో దీపంలా రైల్వే ప్రయాణికుల భద్రత.. ఒడిశా ప్రమాదంతో వెలుగుచూస్తున్న లోపాలు

జూన్ 15వతేదీ నాటికి ముంబయిలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఏడాది అరేబియా సముద్రంలో తలెత్తిన మొట్టమొదటి తుపాన్ అని అధికారులు చెప్పారు. బీపర్ జోయ్ తుపాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రతీ 6 గంటలకు ఒకసారి తీరప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తామని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు.