Girijan Reservation: ఇప్పుడు కాదు.. ఆ తర్వాతే.. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం ..

గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Girijan Reservation: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 33ను జారీ చేసిన సంగతి తెలిసింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదంకోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే ఇప్పటి వరకు దానికి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

10% Reservations to Girijans: కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ‘గిరిజన బంధు’ అమలు: మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణలో 10శాతం గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్ఎస్ ఎంపీ లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందని అన్నారు. అయితే, తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు.

ST Reservations : ఎస్టీలకు ప్రభుత్వం శుభవార్త.. రిజర్వేషన్ల శాతం పెంపు

సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని అత్యున్నత న్యాయస్థానంలో కేసుల పరిష్కారం లభించిన తర్వాత దీనిపై ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా వివరణ

ట్రెండింగ్ వార్తలు