Panchayat Elections: నేడే.. రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

పోలింగ్ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు..

Panchayat Elections: నేడే.. రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

Updated On : December 14, 2025 / 1:02 AM IST

Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫలితాలను సైతం వెల్లడిస్తారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 193 మండలాల్లో 4వేల 332 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు.. 38వేల 322 వార్డులకు 8వేల 300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది.

మరోవైపు పోలింగ్ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉన్నారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరుగుతున్నాయి. తొలి దశ డిసెంబర్ 11న జరిగాయి. రెండో దశ డిసెంబర్ 14న జరుగుతున్నాయి. ఇక మూడో దశ ఎన్నికలు డిసెంబర్ 17న జరగనున్నాయి.