CM KCR criticizes Congress : వైఎస్ ప్రకటించిన ఉచిత కరెంట్.. ఉత్త కరెంట్ గానే మిగిలిపోయింది : సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నీరు పారకున్నా నీటి తీరువా వసూలు చేశారని గుర్తు చేశారు.

CM KCR criticizes Congress : కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నీరు పారకున్నా నీటి తీరువా వసూలు చేశారని గుర్తు చేశారు. గతంలో వైఎస్ ప్రకటించిన ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ గానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతామని తెలిపారు.

ఇప్పటికే రూ.25 వేలు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేశామని గుర్తుచేశారు. పోడు భూములు జఠిలమైన సమస్యని..వందశాతం పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అసమగ్రంగా ఉండేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాని తెలిపారు. రేపటి బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లెక్కల్ని సభ ముందుంచుతామని పేర్కొన్నారు.

తమ హయాంలో ఒక్కసారే పెట్రోల్ పై పన్నులు పెంచామని తెలిపారు. తాము కేవలం రెండు, రెండున్నర శాతమే పన్నులు పెంచామని స్పష్టం చేశారు. పెట్రోల్ ధరలను అదుపు చేయడం తమ చేతుల్లో ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు