Heart Attack : బాబోయ్.. గుండెపోటుతో మరో విద్యార్థి మరణం, మేడ్చల్ CMR కాలేజీలో విషాదం

గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా సడెన్ గా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగింది. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు కూడా హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. అప్పటివరకు బాగున్న వారు మరుక్షణం గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా మరో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

Heart Attack : బాబోయ్.. గుండెపోటుతో మరో విద్యార్థి మరణం, మేడ్చల్ CMR కాలేజీలో విషాదం

Heart Attack : గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా సడెన్ గా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగింది. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు కూడా హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. అప్పటివరకు బాగున్న వారు మరుక్షణం గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా మరో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

మేడ్చల్ CMR ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. రాజస్తాన్ కు చెందిన విద్యార్థి విశాల్ గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. విశాల్ తన ఫ్రెండ్ తో మాట్లాడి వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి విద్యార్థులు అతడిని ఆసుపత్రికి తరలించేలోగానే విశాల్ మరణించాడు. కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించింది.

Also Read..Heart Attack : సోమవారమే అధిక స్ధాయిలో గుండెపోటు ప్రమాదాలు చోటుచేసుకోవటానికి కారణాలు తెలుసా?

విశాల్ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. అతడి రాజస్తాన్. శుక్రవారం మధ్యాహ్నం తన ఫ్రెండ్ తో మాట్లాడి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతడి స్నేహితులు షాక్ అయ్యారు. అసలేం జరిగిందో అర్థంకాక కంగారు పడ్డారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విశాల్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కాలేజీలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే తమ స్నేహితుడు కుప్పకూలి చనిపోవడాన్ని వారు నమ్మలేకపోతున్నారు.

విశాల్ ఈ ఉదయం కాలేజీకి వచ్చాడు. క్లాసులకు అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత మధ్యాహ్నం కాలేజీ ఆవరణలో తన ఫ్రెండ్స్ తో మాట్లాడాడు. కాసేపు అక్కడ మాట్లాడాక అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నంలో ఒక్కసారిగా అతడు కుప్పకూలాడు. విశాల్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతడి ఫ్రెండ్స్ చెబుతున్నారు. అలాంటి వ్యక్తికి గుండెపోటు రావడం, చనిపోవడం.. తోటి ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు కొంత షాక్ కి గురయ్యారు. విశాల్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read..Heart Attack Constable Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువత మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం జిమ్ చేస్తూ యువ కానిస్టేబుల్ ఇలానే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఇది మరువక ముందే ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్ తన స్నేహితులతో మాట్లాడుతూ కుప్పకూలడం విషాదం నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Shocking death: క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు.. గుండెపోటుతో ఉద్యోగి మృతి .. ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు