Heart Attack : సోమవారమే అధిక స్ధాయిలో గుండెపోటు ప్రమాదాలు చోటుచేసుకోవటానికి కారణాలు తెలుసా?
ఒత్తిడి మీ జీవసంబంధ వ్యవస్థలో మార్పులను ప్రేరేపించే అవకాశం ఉంది, అది మిమ్మల్ని గుండెపోటుకు గురిచేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి స్థాయిలు పెరిగేకొద్దీ, మీ అమిగ్డాలా అని పిలువబడే మీ మెదడులోని ఒక భాగంలో చర్య కూడా పెరుగుతుంది.

Mondays Are the Riskiest Days For Heart Attack
Heart Attack : వారాంతపు శెలవులను సరదాగా గడిపి తిరిగి తమ విధుల్లోకి సోమవారం చేరుతుంటారు. ఒకరంగా సోమవారం విధుల్లోకి చేరటమంటే తిరిగి పని ఒత్తిడిని వారంపాటు ఎదుర్కోవటమే అన్నమాట. సోమవారం అంటే చాలా మందిలో ఒక రకమైన భయం కలుగుతుంది. వారంలో తొలిరోజైన సోమవారం కలిగే ఒత్తిడి, భయం చివరకు హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అనేక అధ్యయనాలలో, శాస్త్రవేత్తలు గుండెపోటు మరణాలు వారంలో ఒక రోజుమాత్రమే అధికంగా ఉంటున్నాయని కనుగొన్నారు. అవి వారాంతాల్లో గుండెపోటు సమస్యలు తక్కువగా ఉండగా, సోమవారాల్లో గణనీయంగా పెరుగుతూ తిరగి మంగళవారం మళ్లీ తగ్గుతున్నాయి.
ది యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో విశ్లేషణ అనంతరం కొంత సమాచారాన్ని ప్రచురించింది. వయోజన పురుషులకు సోమవారం గుండెపోటు ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉంటుందని మరియు వయోజన మహిళల్లో 15 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. సోమవారం తిరిగి విధుల్లోకి రావడం వల్ల ఎదురయ్యే ఒత్తిడే దీనికి కారణమని అనుకున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు అదనపు కారకాలు కూడా ఉండి ఉండవచ్చని సూచించాయి.
ఉదాహరణకు, బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో 2000లో ప్రచురించబడిన ఒక అధ్యయనం, వారాంతంలో అధికంగా మద్యపానం చేయడం వల్ల సమస్యలు తలెత్తవచ్చని సూచించింది. ఇతర అధ్యయనాలు కూడా పదవీ విరమణ పొందినవారిలో సోమవారం గుండె పోటు మరణాలు అధికంగా ఉన్నట్లు కనుగొన్నాయి. ఉన్నతస్థాయి అధికారులు పనిభారం గురించి బహుశా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి వారిలో గుండె పోటు మరణాలు తక్కువ ఉంటాయట.
ఒత్తిడి మీ జీవసంబంధ వ్యవస్థలో మార్పులను ప్రేరేపించే అవకాశం ఉంది, అది మిమ్మల్ని గుండెపోటుకు గురిచేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి స్థాయిలు పెరిగేకొద్దీ, మీ అమిగ్డాలా అని పిలువబడే మీ మెదడులోని ఒక భాగంలో చర్య కూడా పెరుగుతుంది. ఒత్తిడితో పోరాడటానికి మీ ఎముక మజ్జ మరింత రోగనిరోధక కణాలను బయటకు తీయడానికి ప్రేరేపిస్తుంది. కానీ ఈ పెరుగుదల ధమనులు మరియు గుండెకు హాని కలిగించే మంటను కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.