Shocking death: క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు.. గుండెపోటుతో ఉద్యోగి మృతి .. ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ జరుగుతుంది. శనివారం రాజ్‌కోట్ - సూరత్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సురేంద్ర‌నగర్ జిల్లా పంచాయతీకి చెందిన జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ పాల్గొన్నారు. రాథోడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ వేసిన తరువాత ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించాడు.

Shocking death: క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు.. గుండెపోటుతో ఉద్యోగి మృతి .. ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు

Heart Attack

Updated On : February 26, 2023 / 8:32 AM IST

Shocking death : చిన్న వయస్సు వారి నుంచి వృద్ధుల వరకు హఠాత్తుగా గుండెపోటు రావడం.. కుప్పకూలిపోయి మరణించడం వంటి ఘటనలు ప్రతీరోజూ వింటూనే ఉన్నాం. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తూనే.. ఒక్కసారిగా ఛాతిలో నొప్పిరావడం, అక్కడికక్కడే కుప్పకూలిపోవటంతో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఓ జీఎస్టీ ఉద్యోగి గుండెపోటు రావడంతో ఉన్నట్లుండి గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిమాణంతో కంగుతిన్న తోటి ఉద్యోగులు అతని వద్దకు వెళ్లి పైకిలేపేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చి బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడు కుప్పకూలిపోయాడు.

Heart Attack : సోమవారమే అధిక స్ధాయిలో గుండెపోటు ప్రమాదాలు చోటుచేసుకోవటానికి కారణాలు తెలుసా?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ జరుగుతుంది. శనివారం రాజ్‌కోట్ – సూరత్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సురేంద్ర నగర్ జిల్లా పంచాయతీకి చెందిన జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ పాల్గొన్నారు. రాథోడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ వేసిన తరువాత ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న తోటి ఉద్యోగులు పరుగు వసంత్ వద్దకు చేరుకున్నాడు. కిందపడిఉన్న వసంత్ రాథోడ్‌ను పైకిలేపేందుకు ప్రయత్నం చేయగా.. అప్పటికే అతను మరణించినట్లు గుర్తించారు.

Heart Attack Constable Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఈ విషయంపై వైద్యులు వివరాల ప్రకారం.. వసంత్ రాథోడ్‌కు ఉన్నట్లుండి గుండెపోటు వచ్చిందని, ఆకారణంగానే మరణించాడని తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఈ విధంగా క్రికెట్ ఆడుతూ ఇద్దరు మరణించారు. ప్రస్తుతం వసంత్ రాథోడ్ మూడో వ్యక్తి. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదోని పట్టణ శివారులోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చిన ఓ యువకుడు గుండెపోటుతో ఉన్నట్లుండి కుప్పకూలిపోయి మరణించాడు. మృతుడు పట్టణంలోని తిరుమలనగర్ కు చెందిన సాయి ప్రభు (25). ప్రతీరోజూ ఉదయాన్నే 6గంటలకు జిమ్ కు వెళ్లేవాడు. కాగా, శనివారం వ్యాయామం పూర్తిచేసుకొని కిందికి దిగగా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించాడు. ఇలాంటి ఘటనలు ప్రతీరోజూ వెలుగులోకి వస్తున్నాయి.