Black Magic : డబ్బు డబుల్ అవుతుందని ఆశపడ్డాడు, రూ.11లక్షలు పోగొట్టుకున్నాడు.. హైదరాబాద్‌లో ఘరానా మోసం

డబ్బులు ఊరికే రావని అని ఎంత చెప్పినా ఈ జనం పట్టించుకోరు. మనిషి అత్యాశే అతడి పాలిట శాపమని తెలుసుకోరు.

Black Magic : డబ్బు డబుల్ అవుతుందని ఆశపడ్డాడు, రూ.11లక్షలు పోగొట్టుకున్నాడు.. హైదరాబాద్‌లో ఘరానా మోసం

Black Magic

Black Magic : డబ్బులు ఊరికే రావని అని ఎంత చెప్పినా ఈ జనం పట్టించుకోరు. మనిషి అత్యాశే అతడి పాలిట శాపమని తెలుసుకోరు. కొందరు కష్టపడి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. మరికొందరు కష్టపడకుండానే ఎక్కుడ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్లు.. డబ్బు డబుల్ అవుతుందంటే, ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తారు. ఏది అడిగినా ఇచ్చేస్తారు. నిండా మునిగాక లబోదిబోమంటారు.

Abdullapurmet Double Murder Case : పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్.. అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో సంచలన విషయాలు

చంద్రుడిపై చక్కర్లు కొడుతున్న ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, బ్లాక్ మేజిక్ లను నమ్ముతున్నారు. అడ్డంగా మోసపోతున్నారు. టీవీ, పేపర్లలో ఇలాంటి ఘటనలు చూస్తునే ఉన్నారు. అయినా, కొందరిలో మార్పు రావడం లేదు. అత్యాశ చావదు. తాజాగా డబ్బులు డబుల్ అవుతాయనే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా రూ.11లక్షలు పొగొట్టుకున్నాడు. హైదరాబాద్ మీర్ పేట్ లో ఈ ఘటన జరిగింది.

Girl Gang Rape: రేప్ కేసు ఫైల్ చేసేందుకు వెళ్తే.. దారుణానికి తెగబడ్డ పోలీసు

తన మాయా శక్తులతో డబ్బుని రెట్టింపు చేస్తానని చెబుతూ ఓ మహిళ, ఆమె ముఠా మోసానికి పాల్పడింది. హస్తినాపురం కస్తూరి కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆ ముఠా వలలో చిక్కాడు. మొదట శ్రీనివాస్ రెడ్డి రూ.5వేలు పూజలో పెడితే, ఆ డబ్బుని రూ.50వేలగా చేసినట్లు మహిళ మాయ చేసింది. దాంతో శ్రీనివాస్ రెడ్డికి మరింత ఆశ పెరిగింది. ఏకంగా రూ.11 లక్షలు తీసుకొచ్చి పూజలో పెట్టాడు. అంటే, ఆ గ్యాంగ్ తమ పని మొదలుపెట్టింది. పోలీసులం అంటూ ఓ 15మంది వచ్చారు. శ్రీనివాస్ రెడ్డిపై కట్టెలతో దాడి చేశారు. పూజలో ఉంచిన రూ.11లక్షల డబ్బు సంచిని తీసుకుని కారులో పరార్ అయ్యారు. కాసేపటికి తేరుకున్న శ్రీనివాస రెడ్డికి అసలు విషయం బోధపడింది. తాను మోసపోయాను అని తెలుసుకుని మీర్ పేట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.