Harish Rao : వాళ్లు గెలవగానే వీళ్లను, వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకి పంపిస్తారు- మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నారు. ఇటలీ బొమ్మ అన్నారు. రేవంత్ నోటికి మొక్కాలి. Harish Rao

Harish Rao : వాళ్లు గెలవగానే వీళ్లను, వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకి పంపిస్తారు- మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

Harish Rao On Revanth Reddy

Harish Rao On Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు చెలరేగిపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. రాహుల్, రేవంత్ లపై విరుచుకుపడ్డారు.

Also Read : సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనం

రేవంత్ నోటికి మొక్కాలి..
”కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారు. ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నారు. ఇటలీ బొమ్మ అన్నారు. నోటికి ఏదోస్తే అది తిట్టారు. ఇప్పుడేమో సోనియా గాంధీ దేవత అంటున్నారు. రేవంత్ నోటికి మొక్కాలి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి. పూటకో పార్టీ మారే వ్యక్తి. కుర్చీల కోసం పార్టీ మారతాడు.

రేవంత్ డీఎన్ఏ ఏంటో రాహుల్ తెలుసుకోవాలి..
రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడతా, బీజేపీపై పోరాడే డీఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదు. మేము ఎవరికీ బీ టీం కాదు. మేం తెలంగాణ ప్రజల టీం. BRS, BJP ఎప్పటికీ ఒక్కటి కాదు. నీళ్లు, నూనె ఎప్పుడైనా కలుస్తాయా? ఇదీ అంతే.

Also Read : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం

కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ ను జైల్లో వేయకపోవునా?
కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం లేదు. రాజకీయ ప్రతీకారం తెలీదు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..? పక్క రాష్టాల్లో చూస్తున్నాం. వాళ్ళు గెలవగానే వీళ్ళను జైలుకు పంపిస్తారు. వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారు” అని హాట్ కామెంట్స్ చేశారు హరీశ్ రావు.