Jeevan Reddy : సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ ఎందుకు చేయడం లేదు? Jeevan Reddy

Jeevan Reddy : సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనం

Jeevan Reddy Slams CK KCR

Jeevan Reddy Slams CK KCR : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జైలుకి వెళ్లడం ఖాయం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామన్నారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..
”వైఎస్సార్ హయాంలో 38వేల కోట్లతో గోదావరి నీటిని ఒడిసి పట్టడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించాం. రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ గా పేరు మర్చి 1,20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతం నిషేధిత ప్రాంతంగా మారింది. వరదల్లో నీటమునిగిన 11 పంపు సెట్లను చూడడానికి కూడా ఎవరినీ అనుమతించలేదు. మేడిగడ్డ బ్యారేజ్ లో 20వ పిల్లర్ బ్రిడ్జి కుంగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నా మేదోమథనం అని కేసీఆర్ అన్నారు. మరిప్పుడు ఏమైంది? మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.

Also Read : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ప్రమాదంపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

అధికారంలోకి రాగానే సిట్టింగ్ జడ్జితో విచారణ..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతాం. సీఎం కేసీఆర్ కటాకటాల వెనక్కి పోవడం తథ్యం. తెలంగాణ ప్రజలు ఓటు అనే విష్ణుచక్రంతో కేసీఆర్ ని ఓడిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేసీఆర్ ఏ నాటికైనా న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందే.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ అవినీతి ప్రాజెక్ట్ గా మార్చారు.

కేంద్రం ప్రభుత్వం ఎందుకీ మౌనం?
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై బీజేపీ నాయకులు మాటలకే పరిమితం అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అంతర్గత ఒప్పందంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి. 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతిని బట్టబయలు చేస్తాము” అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన..
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన పెద్ద శబ్దంతో కుంగింది. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్టు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజీ వంతెన మీదుగా వాహనరాకపోకలను నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు.

Also Read : కుంగిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించారు లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీ బ్యారేజీ మెుత్తం పొడవు 1.6 కిలోమీటర్లు కాగా..ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.

గోదావరి నదిపై 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీని నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది కావటం విశేషం. ఈ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు.

రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. పిల్లర్లు కుంగటానికి కారణలు తెలుసుకునే పనిలో పడ్డారు ఇంజినీర్లు.