Kaleshwaram Medigadda Lakshmi Barrage : కుంగిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్
నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ లోని నీటిని ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు డ్యామ్ 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Kaleshwaram Medigadda Barrage
Kaleshwaram Medigadda Lakshmi Barrage : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగి పోయింది. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. 15వ నెంబర్ పిల్లర్ నుంచి 20వ నెంబర్ పిల్లర్ వరకు వంతెన కుంగినట్లు అధికారులు తెలిపారు.
నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ లోని నీటిని ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు డ్యామ్ 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారుల అలర్ట్ అయ్యారు.
వంతెన కుంగిపోవడంతో లక్ష్మీ బ్యారేజ్ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేశారు. వంతెన కుంగిపోయిన విషయంలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.