Gachibowli Rape Attempt : గచ్చిబౌలిలో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం చేయించిన మహిళ.. న్యూడ్ వీడియోలు తీసి

అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళ యువతిని కిడ్నాప్ చేసింది. యువకులతో అత్యాచారయత్నం చేయించింది. నగ్నంగా ఉంచి వీడియోలు కూడా రికార్డ్ చేసి పైశాచిక ఆనందం పొందింది.

Gachibowli Rape Attempt : గచ్చిబౌలిలో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం చేయించిన మహిళ.. న్యూడ్ వీడియోలు తీసి

Gachibowli Rape Attempt

Gachibowli Rape Attempt : హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సాటి మహిళ అని కూడా చూడకుండా ఓ యువతిపై దుర్మార్గానికి ఒడిగట్టింది మరో మహిళ. యువతికి తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆ మహిళ నీచానికి దిగజారింది. యువతిని కిడ్నాప్ చేసి బంధించింది. అంతటితో ఆగలేదు యువకులతో యువతిపై అత్యాచారయత్నం చేయించింది. అంతేకాదు యువతిని నగ్నంగా ఉంచి వీడియోలు కూడా రికార్డ్ చేసి పైశాచికంగా ప్రవర్తించింది.

కొండాపూర్ శ్రీరాంనగర్ లో భర్తతో కలిసి ఓ మహిళ నివాసం ఉంటోంది. అదే కాలనీలో ఉండే యువతితో మహిళ భర్తకు పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఇది చూసి సదరు మహిళ వారిపై అనుమానం పెంచుకుంది. యువతి తన భర్తతో వివాహేతరం సంబంధం పెట్టుకుందనే అనుమానం పెనుభూతంగా మారింది. అంతే, ఆ మహిళ విచక్షణ కోల్పోయింది.

Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక

ఈ నెల 26న మాట్లాడాలి రమ్మంటూ యువతిని శ్రీరాంనగర్ లోని తన ఇంటికి పిలిపించుకుంది. ఇంట్లోకి వచ్చిన యువతిని బాత్ రూమ్ లో బంధించింది. ఆ తర్వాత పథకం ప్రకారం నలుగురు యువకులను పిలిపించి వారితో యువతిపై దాడి చేయించింది. ఆ నలుగురు యువతిపై అత్యాచారయత్నం చేశారు.

బాధితురాలిని దారుణంగా హింసించారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో గాయాలు చేశారు. ఈ దారుణం మొత్తాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన మహిళ పైశాచిక ఆనందం పొందింది. విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతిని బెదిరించింది.

Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

కాగా, ప్రైవేట్ భాగంలో తీవ్ర గాయం కావడంతో బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. అనుమానంతో శాడిస్ట్ లా బిహేవ్ చేసిన మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేవలం అనుమానంతో యువతి పట్ల ఆ మహిళ ప్రవర్తించిన తీరు స్థానికులనే కాదు పోలీసులనూ షాక్ కి గురి చేసింది.

Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త