Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

ఆస్తి కోసం ఓ కొడుకు కసాయిలా మారాడు. కన్న తండ్రినే కడతేర్చాలని చూశాడు. బైక్ పై వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు.(Son MurderAttempt On Father)

Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

Son Murderattempt On Father

Son MurderAttempt On Father : మనిషి తన ఆర్థిక అవసరాల కోసం సృష్టించిన కాగితపు ముక్క.. ఇప్పుడు మనిషినే శాసిస్తోంది. ఆ కాగితపు ముక్క కోసం మనిషి దిగజారిపోతున్నాడు. ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నాడు. మరో మనిషి ప్రాణం తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. చివరికి రక్త సంబంధీకులను కూడా వదలడం లేదు. కని పెంచిన తల్లిదండ్రుల కన్నా.. వారి సంపాదించిన డబ్బు, ఆస్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బు కోసం, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను కూడా కడతేర్చడానికి వెనకాడటం లేదు.

చిత్తూరు జిల్లా పీలేరులో అలాంటి దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ కొడుకు కసాయిలా మారాడు. కన్న తండ్రినే కడతేర్చాలని చూశాడు. తనను కన్నవారి కంటే వారి నుంచి వచ్చే ఆస్తి ముఖ్యం అనుకున్నాడు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డిని చంపేందుకు యత్నించాడు. బైక్ పై వెళ్తున్న తండ్రిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి పరారయ్యాడు. హత్యాయత్నం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కన్న కొడుకు చేతిలో హత్యాయత్నానికి గురైన తండ్రి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.(Son MurderAttempt On Father)

Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త

ఆస్తి కోసం తన కొడుకే తనను చంపాలని చూడటం చంద్రశేఖర్ రెడ్డినే కాదు అతడి బంధువులను, స్థానికులను సైతం షాక్ కి గురి చేసింది. ఈ దారుణాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కలికాలం అంటే ఇదేనేమో అని కామెంట్ చేస్తున్నారు. లక్ష్మీ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. అలాంటి వ్యక్తి ఆస్తి కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడటం తండ్రితో పాటు బంధువులను షాక్ కి గురి చేసింది. లక్ష్మీ ప్రసాద్ పథకం ప్రకారం తన తండ్రిని చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశాడు. అయితే, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన కారు నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. కన్న కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

Delhi : నైజీరియన్ నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు

చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు. లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మొదటి భార్య కొడుకు. కాగా, చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య మరణించింది. అయితే, ఆస్తి విషయంలో తండ్రి, కొడుకు మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తున్నాయి. తండ్రిని చంపితే కానీ తనకు ఆస్తి దక్కదని భావించిన కొడుకు… చివరకు హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తండ్రి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Social Media : న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధింపులు-అరెస్ట్ చేసిన పోలీసులు