Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు

వయస్సు 38 ఏళ్లు. దేశంకాని దేశం వచ్చి పెళ్లి పేరుతో ఏకంగా 300లమందిని మోసం చేశాడో ఘనుడు. కోట్లు రూపాయలు దోచేశాడు. ఆఫ్రికా నుంచి వచ్చి 300లమంది భారతీయ మహిళలకు పెళ్లి పేరుతో మోసం చేసి వారి నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన 38 ఏళ్ల నైజీరియా వ్యక్తిని నోయిడా సైబర్ క్రైంపోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు

Nigerian Man Held For Cheating 300 Women Of Crores On Marriage Promise

Nigerian man  cheating 300 women of crores on marriage promise : వయస్సు 38 ఏళ్లు. దేశంకాని దేశం వచ్చి పెళ్లి పేరుతో ఏకంగా 300లమందిని మోసం చేశాడో ఘనుడు. కోట్లు రూపాయలు దోచేశాడు. కానీ పాపం పండింది. పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆఫ్రికా నుంచి వచ్చి 300లమంది భారతీయ మహిళలకు పెళ్లి పేరుతో మోసం చేసి వారి నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గరుబా గలుంజే అనే 38 ఏళ్ల నైజీరియా వ్యక్తిని నోయిడా సైబర్ క్రైంపోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

నైజీరియాలోని లాగోస్‌ ప్రాంతానికి చెందిన గరుబా గలుంజే దక్షిణ ఢిల్లీలోని కిషన్‌గఢ్‌లో నివాసం ఉంటూ సోషల్ మీడియా వేదికగా వివాహ సంబంధ వెబ్‌సైట్ల ద్వారా యువతులతో స్నేహం చేసుకునేవాడు. తరువాత వారికి మాయమాటలు చెప్పేవాడు. తాను కెనడాలో సెటిల్ అయిన భారతీయ వ్యక్తిని అని నమ్మించేవాడు. తాను అన్ని విధాలుగా సెటిల్ అయ్యానని ఇక వివాహం చేసుకోవాలనుకుంటున్నానని నమ్మించేవాడు. అలా అతని వలలో ఎంతోమంది పడ్డారు. దగాపడ్డారు. డబ్బులు కోల్పోయారు.

ఈక్రమంలో ఈ కేటుగాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ యువతి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ‘జీవన్‌ సాథీ’ వివాహ వెబ్‌సైటులో సదరు యువతి కూడా తన పేరు నమోదు చేసుకొంది. ఈ వెబ్‌సైటు ద్వారా ఆమెకు పరిచయమైన వ్యక్తి ఇండో – కెనడియన్‌ అయిన తన పేరు సంజయ్‌సింగ్‌ అని చెప్పినట్లు నోయిడా సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషను ఇన్‌స్పెక్టర్‌ రీటా యాదవ్‌ తెలిపారు. అలా పరిచయం చేసుకన్న అతగాడు ఆమెను నమ్మించటానికి యత్నించాడు. అతగాడిని నమ్మి పలుమార్లు డబ్బులిచ్చిందామె. పలు దఫాలుగా రూ.60 లక్షల వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకున్నాడు.

తరువాత తాను మోసపోయినట్లు యువతి ఆలస్యంగా గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందిన తర్వాత కూపీ లాగడంతో నైజీరియన్‌ గుట్టు రట్టయి అరెస్టు చేసినట్లు రీటా యాదవ్‌ తెలిపారు. విచారణలో ఇలా దాదాపు 300 మంది మహిళలను అతను మోసం చేసినట్లు తేలిందని నోయిడా పోలీసులు తెలిపారు.

గరుబా మొదటిసారిగా ఫిబ్రవరి 2019లో ఆరు నెలల వీసాపై రెడీమేడ్ దుస్తుల సంబంధించిన వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చాడు. తరువాత మరోసారి మే 22 వరకు మెడికల్ వీసాపై మార్చి 18 న భారత్ వచ్చాడు. ఈ క్రమంలో చాలాసార్లు తనను తాను మార్చుకునేవాడు. అలా పేర్లు మార్చకుంటూ ఎక్కువ కాలం భారత్ లో గడిపేవాడని పోలీసులు తెలిపారు. ఇక్కడ యువతులను మోసం చేస్తు వారి వద్దనుంచి డబ్బులు కొల్లగొట్టి ఆ డబ్బుని నైజీరియాలోని తన కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మనీ ఎక్స్ఛేంజ్ సేవల ద్వారా మోసం బదిలీ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

అరెస్టు సమయంలో..బ్యాంక్ ఆఫ్ థాయ్‌లాండ్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, ఇంటర్‌పోల్, యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఎఫ్‌బిఐ పేర్లతో నకిలీ లేఖలతో సహా పాస్‌పోర్ట్, ఏడు మొబైల్ ఫోన్లు, 15 పత్రాల ఫోటోకాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి 406 (క్రిమినల్ ట్రస్ట్ ఆఫ్ ట్రస్ట్), 419 (వంచన ద్వారా మోసం చేయడం) సెక్షన్లు 420 (చీటింగ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.