Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త

లోన్ యాప్ ల జోలికి వెళ్లొద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఇంకా కొంతమంది వాటికి బాధితులుగా మారుతున్నారు. చివరికి పరువుతో పాటు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.(Loan App Harassment)

Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త

Loan App

Loan App Harassment : ఆన్‌లైన్ లోన్ యాప్‌ల జోలికి వెళ్లొద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఇంకా కొంతమంది వాటికి బాధితులుగా మారుతున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల కబంద హస్తాల్లో చిక్కుకుంటున్నారు. వారి చేతిలో వేధింపులకు గురవుతున్నారు. లోన్ యాప్ నిర్వాహకులు న్యూడ్ ఫొటోలతో చేసే వేధింపులు తాళలేక కొందరు అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాల గురించి రోజూ వార్తలు వస్తున్నా ఇంకా కొంతమందిలో మార్పు రావడం లేదు.

Social Media : న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధింపులు-అరెస్ట్ చేసిన పోలీసులు

తాజాగా హైదరాబాద్ కి చెందిన ఓ యువతి లోన్ యాప్ లో రుణం తీసుకుంది. అయితే సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో యాప్ ప్రతినిధి మనీష్ కుమార్ బరితెగించాడు. యువతి ఫొటోలను న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. ఆ తర్వాత ఆ న్యూడ్ ఫొటోలను యువతికి పంపి వేధించాడు. అంతటితో ఆగలేదు. ఆమె బంధువులకు, స్నేహితులకు కూడా పంపి వేధించాడు.

మనీశ్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నిందితుడి కోసం గాలించారు. బిహార్ లో ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే అక్కడికెళ్లి ఆ నీచుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.(Loan App Harassment)

టెక్నాలజీ ద్వారా నిందితుడు బిహార్‌లోని సివాన్‌ జిల్లా గోపాల్‌పూర్‌ కోఠిలో ఉన్నట్టు తెలుసుకున్నామని పోలీసు తెలిపారు. మనీష్‌ కుమార్‌ను అరెస్టు చేసి బిహార్ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు

ఈ కేసులో వికాస్‌ కుమార్‌ అనే లోన్‌ యాప్‌ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. వాయిదాలు సకాలంలో చెల్లించని వారి ఆధార్‌, పాన్‌ కార్డు, ఫొటోను వికాస్‌కు.. మనీష్‌ పంపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అసభ్య చిత్రాలను లోన్ తీసకున్న వారి ఫోన్‌లో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లను ఎంపిక చేసుకొని వారి మొబైల్‌ ఫోన్లకు మనీష్‌ పంపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వికాస్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఓ అడ్రస్ ఉండదు.. చెప్పుకోవడానికి ఆఫీస్ ఉండదు. ఇవ్వడం అయినా.. లాక్కోవడం అయినా.. అంతా ఆన్‌లైనే..! డబ్బులు చెల్లించడం గంట అటు ఇటు అయినా.. ప్రాణాలు పోయేలా వేధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లోన్‌యాప్ ఆగడాలు మళ్లీ పెరిగాయ్. మన అవసరాన్ని వాళ్లు పెట్టుబడిగా చేసుకొని.. నరకం చూపిస్తారు. శవాల మీద చిల్లర ఏరుకుంటారు. లోన్‌యాప్ ఆగడాలతో వరుసగా ప్రాణాలు పోతున్న వేళ.. పోలీసులు అలర్ట్ అయ్యారు.

డబ్బు కావాలని ఒక్క క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో మనీ జమ చేస్తారు. ఎంతో కొంత వడ్డీ తీసుకుంటారు. సక్రమంగా కట్టామా సరేసరి ! లేకపోతే అంతే సంగతులు. ఫోటోని న్యూడ్ ఫొటో చేస్తారు.. దాంతో వేధింపులు షురూ చేస్తారు. డబ్బులు తీసుకున్నాడు తిరిగి ఇవ్వడం లేదు.. మోసం చేస్తున్నాడు.. అంటూ ఆ న్యూడ్ ఫొటోలను బంధువులు, మిత్రులు, తెలిసిన వారికి, పరిచయం ఉన్న వారికి అందరికీ పంపుతారు. ఆ తర్వాత తెలిసిన వారికి ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అయితే… తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించినా.. వడ్డీ పెరిగిందని, ఛార్జీలు కట్టాలని వేధిస్తారు. బంధుమిత్రులకు మేసేజీ పెడతామని బెదిరిస్తారు. ప్రాణం ఉన్నంతసేపు, రక్తం పారినంతసేపు జలగలు పీల్చుకుంటాయేమో… ఈ ఆన్‌లైన్‌ దగుల్బాజీలు మాత్రం ప్రాణం పోయినా వదలడం లేదు. వేధింపులు ఆపడం లేదు.(Loan App Harassment)

ఆన్‌లైన్‌లో లోన్‌యాప్స్‌ ఇప్పుడు పోటెత్తుతున్నాయ్. ఈ యాప్స్‌ ద్వారా అప్పులు తీసుకొని.. వాటికి వడ్డీలు చెల్లించలేక అవమానాలు పాలైన వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ! లక్ష రూపాయలు తీసుకొని వడ్డీగా 2 లక్షలు కట్టిన ఘటనలు ఎన్నో. వడ్డీకి చక్రవడ్డీ.. ఆపైన భూచక్రవడ్డీ లెక్కలు వేసి జలగలు పీల్చినట్లు.. జనాల రక్తం పీలుస్తున్నాయీ ఆన్‌లైన్ లోన్‌యాప్స్‌. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో. ప్రభుత్వాలు, పోలీసులు.. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఆగడాలు ఆగడం లేదు. ఆ మధ్య ఆ దారుణాలు తగ్గినట్లే కనిపించినా.. ఇప్పుడు ఆన్‌లైన్‌ లోన్ మాఫియా మళ్లీ విషం కక్కుతోంది.