TOOR DAL CULTIVATION : కంది పంటకు నష్టం కలిగించే పేనుబంక, నివారణ చర్యలు !

పిల్ల మరియు తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, వృవ్వులు మరియు కాయల నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన అకులు ముడతలు వడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లయితే గింజ తయారవ్వదు. ఈ పురుగులు తేనె వంటి పదార్ధాన్ని విసర్జిస్తాయి.

TOOR DAL CULTIVATION : ప్రత్తి, మిరప పోగాకులకు ప్రత్యామ్నాయ౦గా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్ తో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి రైతులు సాగు చేపడుతున్నారు. నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్ర రేగడి, చల్కా నేలల్లో , మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు.

ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉండే ఈ పంట సాగులో అనేక మెళుకువలు పాటించాల్సిన అవసరం ఉంది. పూత దశ నుండి కోత దశ వరకు అనేక పురుగులు ఈ పంటను ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటి వల్ల దిగుడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కంది పంటను ఆశించే పురుగులలో పేను బంక కూడా ఒకటి.

కందిలో పేనుబంక ;

పిల్ల మరియు తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, వృవ్వులు మరియు కాయల నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన అకులు ముడతలు వడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లయితే గింజ తయారవ్వదు. ఈ పురుగులు తేనె వంటి పదార్ధాన్ని విసర్జిస్తాయి. దీంతో ఆకులు, కాయలపైన మసి తెగులు, బూజు అశయించి నల్లగా మారతాయి. మేఘావృతమైన, తేమతో కూడిన చల్లటి వాతావరణం ఈ పురుగు ఆశించడానికి అనుకూలం. అదే అధిక వర్షపాతం ఉన్నట్లయితే దీని ఉధృతి తగ్గుతుంది.

నివారణ :

మోనోక్రోటోఫాస్‌ 86% ఎస్‌.ఎల్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 30% ఇ.సి. 2.2 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు