Banana Crop Farming : 5 ఎకరాల అరటి సాగుతో.. రూ. 25 లక్షల ఆదాయం
గెలలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటితోటను, 5 ఎకరాల్లో సాగుచేసారు రమణారెడ్డి. ఇది మొత్తం కర్పూర రకం. 2021 మే నెలలో అరటి మొక్కలను నాటారు. వీటికి పూర్తిగా బిందు సేద్యంతో నీరందిస్తున్నారు.
- Guntupalli Ramakrishna
- Published On : May 25, 2023 / 07:00 AM IST
Banana Crop Farming
Banana Crop Farming : తక్కువ ఖర్చుతో కచ్చితమైన నికరాదాయం పొందుతూ .. రైతులోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రణాళిక బద్దంగా సాగుచేస్తూ నాణ్యమైన అరటిని పండిస్తున్నారు. దీంతో వ్యాపారులు.. గెల చెట్టుపై వున్నప్పుడే అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అరటి సాగులో మంచి లాభాలను గడిస్తున్న ఈ రైతు ద్వారా సాగు వివరాలు తెలుసుకుందా..
READ ALSO : Banana Plantation : అరటిసాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు
పొడవాటి అరటి గెలలు, దృఢంగా, ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో, చూడముచ్చటగా ఉన్న ఈతోట ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతుది. ప్రతి గెలలోను 8-12 హాస్తాలకు తగ్గకుండా వున్నాయి . ఈ తోటను చూసిన వారెవరైనా అబ్బా అనక మానరు. ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండంల , వై. కొత్తపల్లి గ్రామంలో వుంది ఈ క్షేత్రం. ఈ అద్భుత వ్యవసాయానికి సృష్టికర్త రైతు రమణారెడ్డి.
READ ALSO : Banana Cultivation : అరటిసాగులో అనువైన రకాలు, పిలకల ఎంపిక.. మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం
గెలలతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ అరటితోటను, 5 ఎకరాల్లో సాగుచేసారు రమణారెడ్డి. ఇది మొత్తం కర్పూర రకం. 2021 మే నెలలో అరటి మొక్కలను నాటారు. వీటికి పూర్తిగా బిందు సేద్యంతో నీరందిస్తున్నారు. ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ప్రతి రెండు రోజులకు ఒకసారి చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం అరటి గెలలు కోతకు సిద్ధమయ్యాయి. వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతుకు రవాణ ఖర్చులు కూడా తగ్గి, మంచి ఆదాయం పొందుతున్నారు.
