Banana Plantation : అరటిసాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు

టిష్యూకల్చర్ అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి. ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కలు పెరిగే కొద్ది ఎరువుల మోతాదును పెంచుకోవాలి. ఎక్కువ దఫాల్లో సిఫార్సు చేసిన ఎరువులను ఇవ్వాల్సిన ఆవసరం ఉంటుంది.

Banana Plantation : అరటిసాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు

Banana Plantation

Banana Plantation : అరటి సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నా.. చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పాటించకపోతున్నారు. 12 నెలలపాటు కొనసాగే ఈ పంటలో ముఖ్యంగా పోషక యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. దీనివల్ల గెలసైజు తగ్గి  ఆశించిన లాభాలు పొందలేకపోతున్నారు. పిలకలు నాటి నుంచి అరటిని విక్రయించేదాకా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు.

అరటితోటల సాగులో మొదటి ఐదు నెలల్లో చేపట్టే  యాజమాన్య పద్ధతులే పంట ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సమతుల్య సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితేనే మంచి దిగుబడులు వస్తాయి. ఆరోగ్యంగా పెరిగిన చెట్లు అధిక బరువున్న గెలల దిగుబడికి దోహదపడతాయి. ముఖ్యంగా తొలి ఐదు నెలల్లో  మొక్కలకు నిర్ధేశించిన  పోషకాలను సమయానుకూలంగా  ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పంట 140 నుంచి 150 రోజుల సమయంలో గెలకు సంబంధించి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

READ ALSO : Banana Cultivation : అరటిసాగులో అనువైన రకాలు, పిలకల ఎంపిక.. మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం

గెల తయారయ్యే సమయంలో ఎన్ని హస్తాలు వస్తాయి. ఒక్కో హస్తంలో ఎన్ని కాయలు ఉంటాయనే విషయం నిర్ధారణ అవుతుంది. అందుకోసం ముందుగా ఎలాంటి ఎరువులు వేయాలి, డ్రిప్‌ ఎరువులు ఏవి వాడాలి, పైపాటుగా ఏమి వేయాలనే విషయం తెలుసుకుని సమతుల్య ఎరువుల వాడాలి. సాధారణంగా రైతులు ఎకరా పొలానికి లెక్కగట్టి ఎరువులను అందిస్తూవుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. అరటిసాగులో ప్రతిమొక్కకు సిఫారసు చేసిన ఎరువును ఎంచుకున్న రకం, సాగుచేస్తున్న నేలను అనుసరించి అందిచాల్సి వుంటుంది.

టిష్యూకల్చర్ అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి. ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కలు పెరిగే కొద్ది ఎరువుల మోతాదును పెంచుకోవాలి. ఎక్కువ దఫాల్లో సిఫార్సు చేసిన ఎరువులను ఇవ్వాల్సిన ఆవసరం ఉంటుంది.

READ ALSO : Banana Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైన అరటి రకాలు ఇవే!

అరటిసాగులో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి నీటి తడులను అందించాలి. ప్రస్తుతం ఆదునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అందరూ డ్రిప్ పద్ధతులను ఉపయోగించి సాగునీటిని అందిస్తున్నారు.  అలాగే అరటిలో నాణ్యమైన గెల రావడానికి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి . గెల పూర్తిగా వచ్చిన తరువాత చివర ఉండే పువ్వును కోసివేయాలి. అంతే కాకుండా పోషకాలను కూడా పైపాటుగా అందించాలని  ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. పి. సుధా జాకబ్ చెబుతున్నారు.

ఈ విధంగా పోషక యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే గెలసైజు బాగా వచ్చి ఎకరాకు 30 నుండి 40 టన్నుల దిగుబడి సాధించవచ్చు. అధిక సాంద్రపద్ధతిలో మొక్కలు నాటి, 50టన్నుల దిగుబడి సాధిస్తున్న రైతులు మనమధ్య అనేక మంది వున్నారు.