Health Tips: వారానికి 150 నిమిషాల నడక.. క్యాన్సర్ మాయం.. పరిశోదనల్లో కొత్త విషయాలు
Health Tips: ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. రోజు నడవడం, చిన్న శారీరక వ్యాయామం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్, యుటరస్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయట.

Cancer can be cured with 150 minutes of walking per week
సాధారణంగా ఎక్కువమంది చేయగలిగే శారీరక వ్యాయామాల్లో నడక ఒకటి. అత్యంత తేలికగా, అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య అలవాటు కూడా ఇదే. నిజానికి నడక వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. కానీ మీకు తెలుసా? నడకను నిత్యంగా కొనసాగించడం వల్ల క్యాన్సర్ (Cancer) అనే ప్రాణాంతక వ్యాధి రాకను నిరోధించగలిగే శక్తి వస్తుందట. దీని గురించి నిపుణులు సైతం చెప్తున్నారు. మరి దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నడక, క్యాన్సర్ మధ్య సంబంధం, శాస్త్రీయ ఆధారాలు:
ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. రోజు నడవడం, చిన్న శారీరక వ్యాయామం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్, యుటరస్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయట.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, WHO తెలిపిన ప్రకారం, వారానికి కనీసం 150 నిమిషాలు నడక లేదా 75 నిమిషాల వేగమైన వ్యాయామం క్యాన్సర్ రిస్క్‌ను గణనీయంగా తగ్గించగలదట.
నడక వల్ల క్యాన్సర్ ఎలా తగ్గుతుంది?
1.శరీరంపై కొవ్వు తగ్గించడం:
అధిక బరువు, ముఖ్యంగా పొట్ట మీద కొవ్వు హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. ఇది ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్, యుటరైన్ క్యాన్సర్ రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
2.హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది:
నడక వల్ల ఇన్సులిన్ సెంసిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల లంగ్ క్యాన్సర్ సెల్ వృద్ధి నియంత్రణలో ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే క్యాన్సర్లకు ఇది నివారణ కలిగిస్తుంది.
3.ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది:
నడక శరీరంలోని రోగనిరోధక కణాలను యాక్టివ్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలను గుర్తించి, తొలగించే శక్తి కలిగిన Natural Killer Cells పని తీరు మెరుగవుతుంది.
4.ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది:
నడక యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ (Free radicals) వల్ల కణాలలో వచ్చే డీఎన్‌ఏ డ్యామేజ్‌కి వ్యతిరేకంగా పని చేస్తుంది.
5.చికిత్స పొందుతున్నవారికి ఉపశమనం:
క్యాన్సర్ చికిత్సలో ఉన్నవారికి నడక వల్ల అలసట తగ్గుతుంది. మెదడు హార్మోన్లు సమతుల్యంలోకి వచ్చి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కీమోథెరపీ, రేడియేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది.
నడకను ఆరోగ్యకరంగా ఎలా కొనసాగించాలి?
- రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి
- 1 వారానికి 150 నిమిషాలు మోస్తరు నడక లేదా 75 నిమిషాలు వేగమైన నడక చేయాలి
- స్నీకర్లు లేదా మంచి షూస్ ధరించాలి
- నీటిని తగినంత తాగాలి
- నడక ముందు తర్వాత స్ట్రెచింగ్ చేయడం మంచిది.