ZPTC BY Elections: ఫలితంపై ఉత్కంఠ.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్.. కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..
ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.

ZPTC BY Elections: ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు అధికారులు.
బుధవారం అచ్చవెల్లి, కొత్తపల్లిలో రీ పోలింగ్ జరిగింది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఒంటిమిట్ట కౌంటింగ్ కు రెండు రౌండ్లలో 20 టేబుల్స్ ఏర్పాటు చేయగా, పులివెందుల కౌంటింగ్ కు ఒక్క రౌండ్ లో 10 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.