Pulivendula ZPTC Bypoll: పులివెందుల జడ్పీటీసీ బైపోల్.. రిజల్ట్‌పై క్లారిటీ వచ్చేసిందా? జగన్ మాటల్లో అర్థమేంటి?
రీపోలింగ్ జరిగిన వెయ్యి ఓట్లలో మెజార్టీ సాధిస్తే వైసీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండేదని..(Pulivendula ZPTC Bypoll)

YS Jagan Mohan Reddy
Pulivendula ZPTC Bypoll: కంచుకోటను కాపాడుకోవాలనున్నారు. లాస్ట్ మినిట్ వరకు నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చింది వైసీపీ. పోలింగ్ రోజుకు వచ్చే సరికి సీన్ మారిపోయింది. నాన్ లోకల్ జనం వచ్చారన్నారు. నాన్ లోకల్స్‌ను తెప్పించి టీడీపీ ఓట్లు వేయించుకుందని కూడా అలిగేషన్ చేశారు. కొన్ని బూత్‌లలో రీపోలింగ్ జరిగినా బాయ్‌కాట్ చేసింది ఫ్యాన్ పార్టీ. ఇదంతా చూస్తుంటే ఎక్కడో తేడా కొట్టినట్లు కనిపిస్తోందా.? వైసీపీ అధినేత మాటల్లో అర్థమేంటి.? ఫలితంపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారా.? సిచ్యువేషన్ బాలేనప్పుడు..చిల్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదనుకుంటున్నారా.?
పులివెందుల జడ్పీటీసీ బైపోల్. 15రోజులుగా ఒకటే చర్చ. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయన్నంత హీట్ కనిపించింది. అయితే అది వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. అక్కడ ఏకగ్రీవం తప్ప ఎన్నిక జరిగిన సందర్భాలు లేవు. ఎలక్షన్స్ జరిగినా బంపర్ మెజార్టీతో గెలిచి తీరుతామని ధీమాగా చెప్పుకొచ్చారు వైసీపీ లీడర్లు. అందుకు తగ్గట్లే అభ్యర్థి ప్రకటన..అట్టహాసంగా నామినేషన్..ఓవరాల్‌గా ఎంపీ అవినాశ్‌రెడ్డిని రంగంలోకి దింపి గెలిచి తీరాలని..పరువు నిలబెట్టుకోవాలని భగీరథ ప్రయత్నమే చేసింది వైసీపీ.
కానీ కూటమి అధికారం ముందు..టీడీపీ నేతల పట్టుదల ముందు ఫ్యాన్ పార్టీ గాలి ఏ మాత్రం సరిపోయినట్లు కనిపించట్లేదు. వైసీపీ అధినేత జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి మాటల్ని బట్టి చూస్తే పులివెందుల జడ్పీటీసీ బైఎలక్షన్ రిజల్ట్‌పై ఇప్పటికే వారు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఏజెంట్లను అడ్డుకుని రిగ్గింగ్ చేసుకున్నారని..ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి బూత్ వెబ్ కాస్టింగ్ ఫుటేజీని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు జగన్. కేంద్ర బలగాల రక్షణలో జడ్పీటీసీ బైఎలక్షన్ మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
జడ్పీటీసీ సీటును కోల్పోయామని చెప్పకనే చెప్పినట్లు..
అంటే బైపోల్ రిజల్ట్‌పై ఇప్పటికే ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎంపీ అవినాశ్‌రెడ్డి అయితే టీడీపీతో పాటు, పోలీసులతో పోరాడామని..ఇప్పుడు రచ్చ చేసి ఫలితం లేదని క్యాడర్‌కు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన రోజులు కావు..టైమ్ వచ్చినప్పుడు అన్ని లెక్కలు సరిచేద్దామని కార్యకర్తలకు భరోసా కల్పించారు. వీళ్లిద్దరి కామెంట్స్‌ను బట్టి చూస్తే జడ్పీటీసీ సీటును కోల్పోయామని చెప్పకనే చెప్పినట్లు అయింది.
ఓటమిని వైసీపీ ముందే అంగీకరించిందా?
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఓటమిని వైసీపీ ముందే అంగీకరించిందా? అన్న టాక్ నడుస్తోంది. రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగింది. అక్కడ వెయ్యి ఓట్లు ఉన్నాయి. మొత్తం పది వేల ఓట్లలో 7వేల 5వందల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. రీపోలింగ్ జరిగిన రెండు బూత్‌లలో వెయ్యి ఓట్లు ఉన్నాయంటే అవి తక్కువేం కాదు. గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు. అయినా రీ పోలింగ్‌ను వైసీపీ బహిష్కరించడం చూస్తుంటే ఎక్కడో తేడా కొట్టిందని అర్థమైనట్లే కనిపిస్తోంది.
కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీ పోలింగ్ కు డిమాండ్..
11 మంది అభ్యర్థులు పోటీ చేయగా, పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే నడిచింది. అయితే 12న జరిగిన పోలింగ్‌పై వైసీపీ తీవ్ర అభ్యంతరాలు తెలుపుతోంది. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కోర్టుకెళ్తామని అంటున్నారు నేతలు. అయితే రెండు చోట్ల రీపోలింగ్‌ను వైసీపీ బహిష్కరించడంతో ఫలితం టీడీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ కూడా ఇలానే ఎన్నికలకు దూరంగా ఉంది. దాంతో అప్పటి లోకల్ బాడీ పోల్స్‌లో వైసీపీ వన్‌సైడ్ విక్టరీ సాధించింది.
Also Read: చంద్రబాబుతో సోమువీర్రాజు భేటీ.. టీడీపీ, బాబు పేరు ఎత్తితే ఫైరయ్యే లీడర్‌లో ఎందుకింత మార్పు?
అందుకే రీపోలింగ్‌లో కూడా వైసీపీ పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు వెయ్యి ఓట్లను వైసీపీ వదులుకుందంటే, పులివెందుల ఫలితం ప్రతికూలంగా వస్తుందని ఆ పార్టీ అంచనాకు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీటీసీ ఉపఎన్నికలో మొత్తం దాదాపు 7వేల 500 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సగానికి పైగా ఓట్లు సాధించిన వారు గెలిచినట్లు. అంటే కనీసం 3వేల 500 ఓట్లు రావాల్సి ఉంటుంది. రీపోలింగ్ జరిగిన వెయ్యి ఓట్లలో మెజార్టీ సాధిస్తే వైసీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండేదని..ఫలితం తారుమారయ్యే అవకాశం ఉండేదని అంటున్నారు.
కానీ రీపోలింగ్‌కు దూరంగా ఉండి ఓటమిని ఒప్పుకున్నట్లు అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమని వైసీపీ ఓ అంచనాకు వచ్చిందని..అందుకే రీపోలింగ్‌ను బహిష్కరించిందంటున్నారు. అందుకు తగ్గట్లే జగన్, అవినాశ్‌రెడ్డి కామెంట్స్ ఉన్నాయని..కౌంటింగ్ సందర్భంగా కూడా వైసీపీ పార్టిసిపేషన్ పెద్దగా ఉండకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. పులివెందుల జడ్పీటీసీ బైపోల్ ఫలితం ఎలా ఉండబోతుందో..రిజల్ట్ తర్వాత పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి.