Chilli Crop Cultivation : మిరప తోటల్లో వైరస్ తెగులు ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం

Chilli Crop Cultivation : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు.

chilli crop cultivation process for preventive maintenance

Chilli Crop Cultivation : మిరపను ఆశించే చీడపీడల్లో వైరస్ తెగుళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. గత మూడునాలుగేళ్లుగా ఈ వైరస్ తెగుళ్ల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్థుతం చాలాప్రాంతాల్లో మిరప నుంచి తొలికాపును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ దశలో చాలా ప్రాంతాల్లో మిరపతోటలకు వైరస్ తాకిడి ఎక్కువవటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి, వైరస్ తెగుళ్ల నిర్మూలనకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా.

Read Also : Marigold Flower Cultivation : బంతిపూల సాగులో మెళకువలు.. అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం

మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో ఇప్పుడు వైరస్ తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ తెగుళ్లను రాకుండా నిరోధించగలం తప్ప, వచ్చిన తర్వాత నివారణ లేదు. వైరస్ తెగుళ్ల లక్షణాలు పట్ల రైతులు సరైన అవగాహనతో మెలిగితే దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. మరి వాటిని ఏవిధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం…

నివారణకు చేపట్టాల్సిన చర్యలు : 
బెట్ట పరిస్థితులు, పొడి వాతావరణం ఉన్నప్పుడు వైరస్ తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. అంతే కాదు పంటలో కలుపు మొక్కలు తెగుళ్లకు స్థావరాన్ని కలిపిస్థాయి. ముఖ్యంగా జెమిని వైరస్ దీనినే ఆకుముడత తెగులు అంటారు. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముచుడుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చ రంగు కలిగి ఉండి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.

ఆకుల మీద బొబ్బరులుగా ఏర్పడి ముడుచుకుంటాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకొని కొంత వరకు నివారించవచ్చు. తెల్లదోమ నివారణకు 5 శాతం వేపగింజల కషాయం లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 1.25 మిల్లి లీటర్లు లేదా ఫెన్ ప్రోపత్రిన్ 30 ఇ.సి 0.5 మిల్లి లీటర్లు లేదా స్పైరోమెసిఫెన్ 1 మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కుకుంబర్ మోజాయిక్ వైరస్. ఇదిసొకితే మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి, ఆకారం మారిపోయి, కొనలు సాగి కనిపిస్తాయి. పూత, కాత ఉండదు. ఈ వైరస్ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లి లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

మొవ్వుకుళ్లు తెగులు. దీనినే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అంటారు. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉధృతి ఎక్కువై నీటి ద్వారా ఈ వైరస్ ను మొక్కలకు వ్యాప్తి చేస్తాయి. ఈతెగులు ఆశించిన మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని నిర్ధిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లీ లీటర్లు లేదా స్పైనోశాడ్ 0.25 మిల్లీ లీటర్లు లేదా డైఫెన్ థయూరాన్ 1.25 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా క్లోరోఫెన్ ఫైర్ 2 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

గట్లమీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపుమొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్న ను రక్షణ పంటలుగా వేసుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి.

Read Also : Sugarcane Cultivation Methods : చెరకు కార్శీ తోటల యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

ట్రెండింగ్ వార్తలు