Marigold Flower Cultivation : బంతిపూల సాగులో మెళకువలు.. అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం

Marigold Flower Cultivation : శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో, మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో, సాగు విస్తీర్ణం కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.

Marigold Flower Cultivation : బంతిపూల సాగులో మెళకువలు.. అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం

Marigold Flower Cultivation process

Updated On : December 28, 2023 / 3:09 PM IST

Marigold Flower Cultivation : మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పూలలో ప్రధానమైనది బంతి. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ పూలకు మంచి డిమాండు ఉంటుంది. అంతే కాదు ఎక్కువ కాలం, నిల్వ స్వభావం ఉండటంతో, రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతుంటారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడంతో, అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు రైతులు.

Read Also : Mango Cultivation : మామిడిలో పురుగులు, తెగుళ్ల బెడద నివారణ చర్యలు

సాగు సులభం.. ఆదాయం అధికం :
బంతిపూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏవిధంగా సాధించాలో తెలియజేస్తున్నారు పార్వతిపురం మన్యం జిల్లా ఉద్యానశాఖ అధికారి క్రాంతి కుమార్. పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో, మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో, సాగు విస్తీర్ణం కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.

అయితే.. సాగులో రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతి పంటకాలం 120 రోజులు. నాటిన 55 రోజుల నుంచి పూలదిగుబడి ప్రారంభమై.. మూడు నెలలపాటు దిగుబడి వస్తుంది. ప్రస్థుతం చాలామంది రైతులు ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు.

కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పార్వతిపురం మన్యం జిల్లా ఉద్యానశాఖ అధికారి క్రాంతి కుమార్.

బంతి రకాలు :
ఆఫ్రికన్ ఫ్రెంచ్ బంతి పూల సాగు
ఎకరాకు విత్తనం 500 – 600 గ్రా.

బంతి పూల సాగు :
ఆఫ్రికన్ రకాలు,
మొక్కల మధ్య దూరం ఎటు చూసిన 2 అడుగులు

బంతి పూల సాగు :
ప్రెంచ్ రకాలు
మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 1 అడుగు

బంతి పూల సాగు :
ఒక్కో మొక్క నుండి పూల దిగుబడి 150

బంతి పూల సాగు :
3 వ నెల నుండి పూత 3 నెలల పాటు దిగుబడి

బంతిని ఆశించే చీడపీడలు :
పిండినల్లి గొంగలి పురుగు నల్లిపురుగు పేను, తామర పురుగులు

బంతిలో చీడపీడల నివారణ :
పాస్పామెడన్ 1 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

పిండినల్లి నివారణ :
ఫిప్రోనిల్ లేదా పర్ఫ్ నీటిని పిచికారి చేయాలి

Read Also : Ground Nut Cultivation : రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ సాగు.. పంటలో చేపట్టాల్సిన యాజమాన్యం