Mango Cultivation : మామిడిలో పురుగులు, తెగుళ్ల బెడద నివారణ చర్యలు

Mango Cultivation : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం అక్కడక్కడ మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి.

Mango Cultivation : మామిడిలో పురుగులు, తెగుళ్ల బెడద నివారణ చర్యలు

Prevention Of Insects And Pests In Mango

Mango Cultivation : తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా పూత ప్రారంభం కాలేదు. గత రెండేళ్లుగా రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ సారి మంచి ఫలితాలు సాధించాలంటే , పూత దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా.. పిందె కాయ దశలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణను సమగ్రంగా నివారించాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ చీడపీడల నివారణకు,రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తేలియజేస్తున్నారు, నూజిబీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాధారాణి.

Read Also : Redgram Cultivation : కందిలో పెరిగిన చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం అక్కడక్కడ మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. అయితే మామిడి పంటలో పూతదశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేతలంటున్నారు. అంతే కాదు పూత నుండి కాయ దశలో మారాకా కూడా పురుగులు, తెగుళ్లు అధికంగానే ఆశిస్తుంటాయి.

ముఖ్యంగా పండు ఈగ, కాయతొలుచుపురుగు, బూడిదతెగులు, పక్షికన్నుతెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించాలి. అంతే కాదు కాయ దిగుబడి నాణ్యంగా ఉండాలంటే సకాలంలో సూక్ష్మపోషకాలను అందించాలని వివరాలు తెలియజేస్తున్నారు నూజిబీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాధారాణి.

కాయతొలుచు పురుగు నివారణ :
మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్ పిచికారి చేయాలి

బూడిద తెగులు నివారణ :
నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

బూడిద తెగులు నివారణ :
కెరాథిన్ 1 మి. లీ. డైనోక్యాప్ 1 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

పక్షికన్ను తెగులు నివారణ :
కార్బండిజమ్ 1 గ్రా. లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండిజమ్ + మ్యాంకొజెబ్ (సాఫ్ ) 2 గ్రా. లీటరు నీటికి కలిపి పోషకాల యాజమాన్యం
19-19-19 20-20-20 పొటాషియం పర్మాంగనేట్ 10 గ్రా. యూరియా 5 గ్రా. పిచికారి చేయాలి.

Read Also : Ladies Finger Cultivation : బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు