Redgram Cultivation : కందిలో పెరిగిన చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Redgram Cultivation : కందిలో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. శాస్త్రవేత్తల నివారణకు సూచనలు ఇస్తున్నారు. చలి వాతావరణం కారణంగా పురుగుల ఉధృతి పెరిగింది. సకాలంలో నివారించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

Redgram Cultivation : కందిలో పెరిగిన చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Redgram Cultivation

Redgram Cultivation : మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ కందిలో పురుగుల ఉధృతి పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కంది కాయ దశలో ఉండగా, ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. రసం పీల్చే పురుగైన పేనుబంక తాకిడివల్ల నష్టం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సత్వరమే చేపట్టాల్సిన , సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు, జమ్మికుంట కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రీనివాసరెడ్డి.

అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో చాలా మంది ఈ ఖరీఫ్ లో సాగుచేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది. అయితే చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా రసం పీల్చే పురుగులైన పేనుబంక, తామరపురుగులతో పాటు ఆకుగూడు, మారుకామచ్చల పురుగులు పంటకు తీవ్రనష్టం కలగజేస్తున్నాయి.

Read Also : Kharif Rice Cultivation : రబీకి అనువైన వరిరకాలు – నారుమడి యాజమాన్యం

ఈ పురుగుల వల్ల పూత, పిందె నాశనమవటం కనిపిస్తోంది. వీటితో పాటు అక్కడక్కడ ఎండుతెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్త డి. శ్రీనివాసరెడ్డి.

ఖరీఫ్ కంది పూత, కాత దశలో ఉంది. కందిలో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. శాస్త్రవేత్తల నివారణకు సూచనలు ఇస్తున్నారు. చలి వాతావరణం కారణంగా పురుగుల ఉధృతి పెరిగింది. సకాలంలో నివారించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఆకుగూడు పురుగు నివారణ
వేపనూనె 5 మి. లీ
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

ఆకుగూడు పురుగు నివారణ
ఫ్లూబెండమైడ్ (ఫేమ్) 0.2 మి. లీ
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

ఆకుగూడు పురుగు నివారణ
ఇమామెక్టిమ్ బెంజోయేట్ ( ప్రోక్లైమ్ ) 0.4 గ్రా.
లీటరు నీటికి లేదా ఎకరాకు ఇమామెక్టిమ్ బెంజోయేట్ ( ప్రోక్లైమ్ )
80 గ్రాములు పిచికారి చేయాలి

మారుకామచ్చల పురుగు నివారణ
ఎకరాకు వేపకషాయం
1 లీ. లేదా కొరాజిన్ 60 మి. లీ
లేదా ఫ్లూబెండమైడ్ 40 మి. లీ

పేనుబంక, తామర పురుగు నివారణ
డైమిథోయేట్ (రోగార్ ) 2 మి. లీ
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

పేనుబంక, తామర పురుగు నివారణ
ఎకరాకు ఎసిఫేట్ 300 గ్రా.

ఎండుతెగులు నివారణ
కాపర్ ఆక్సీ క్లోరైడ్ (బ్లైటాక్స్ ) 3 గ్రా.
లీటరు నీటికి కలిపి మొక్క మొదల్లో పోయాలి

ఎండుతెగులు నివారణ
ట్రైకోడెర్మా విరిడి 2కి
పశువుల ఎరువు 50 -100 కలిపి చల్లుకోవాలి.

Read Also : Red Gram Cotton Cultivation : మిగ్‌‌జామ్ తుఫాన్.. పత్తి, కందిలో చేపట్టాల్సిన యాజమాన్యం