Kharif Rice Cultivation : రబీకి అనువైన వరిరకాలు – నారుమడి యాజమాన్యం

Kharif Rice Cultivation : యాసంగి వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి నారుమళ్లపై చలిగాలుల ప్రభావం ఉండటంతో నారుమళ్లలో పెరుగుదల లోపించనున్నట్టు కనిపిస్తోంది. 

Kharif Rice Cultivation : రబీకి అనువైన వరిరకాలు – నారుమడి యాజమాన్యం

Kharif Rice Cultivation And Production

Kharif Rice Cultivation And Production : నీటివసతి కింద, రబీ వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే  విత్తన ఎంపికతో పాటు మేలైన నారుమళ్ల యాజమాన్యం చేపట్టాలి. అసలే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారుకోసం చేపట్టాల్సిన మెళకువలను కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం. శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం..

ఖరీఫ్ లో సాగుచేసిన వరి పంటలు చేతికొచ్చాయి. ప్రస్తుతం రెండవ పంటగా, వరిసాగు కోసం , వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతన్నారు . నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో  ఆరుతడి పంటలను సాగును ఎంచుకుంటున్నా..  నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరిని సాగుచేసుకునేందుకు సంసిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే చాలా మంది వరినారుమడులను పోసుకున్నారు. మరికొంత మంది పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also : Sugarcane Farming Tips : చెరకు నాట్లు – యాజమాన్యం.. అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు 

యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి : 
అయితే, అన్నదాతలు ఈ యాసంగికి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం శీతాకాలం కావడం , చలితీవ్రత పెరుగుండటంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నారుమడులలో మేలైన యాజమాన్యం చేపట్టినట్లైతే నాణ్యమైన నారు పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు  జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం. శాస్త్రవేత్త విజయ్ .

యాసంగి వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి నారుమళ్లపై చలిగాలుల ప్రభావం ఉండటంతో చలి వాతావరణం వల్ల నారుమళ్లలో పెరుగుదల లోపించనున్నట్టు కనిపిస్తోంది. నారుమడిలో విత్తనం చల్లేముందు పశువుల ఎరువు వేయాలి. భాస్వరం మోతాదును రెట్టింపు చేసి వేయాలి. సూక్ష్మ పోషక లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలి. ఉదయం పూట నీరు మార్చి కొత్తనీరు పెట్టాలి.

దొడ్డురకాలు :
ఎం.టి.యు -1010 కె.ఎన్.ఎం -118(కూనారం సన్నాలు)
జగిత్యాల రైస్ -1 (జె.జి.ఎల్ -24423)

సన్న రకాలు :
తెలంగాణ సోనా
కె.ఎన్.ఎం -1638
హె.చ్.ఎం.టి సోనా

ఎరువుల యాజమాన్యం :
నారుమడి తయారి
ఎకరా నారుమడికి
2 క్వింటాళ్ల పశువుల ఎరువు

రబీ వరిసాగు :
ఎకరాకు దొడ్డురకాలు 25 కిలోలు
సన్నరకాలు 20 కిలోలు

రబీ వరిసాగు :
12 గంటలు నానబెట్టాలి
24 గంటలు మండెకట్టాలి

ఎరువుల యాజమాన్యం :
యూరియా 1 కి.
భాస్వరం 2 కి.
పొటాష్ 1 కి.

ఎరువుల యాజమాన్యం :
విత్తనం చల్లిన 15-20 రో, పైపాటుగా యూరియా చల్లుకోవాలి

జింక్ ధాతు లోపం నివారణ :
జింక్ సల్ఫేట్ 2 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

ఎరువుల యాజమాన్యం
యూరియా 1 కి కార్బెండిజమ్ 2 గ్రా. మ్యాంకోజెబ్

నిద్రావస్థ తొలగించేందుకు :
గాఢనత్రికామ్లం 6 .3 మి. లీ.
లీటరు నీటిలో కలిపి 1 కిలో విత్తనాన్ని 24 గం. నానబెట్టాలి.

Read Also : Groundnut Cultivation : యాసంగి వేరుశనగ కోతల్లో పాటించాల్సిన మేలైన జాగ్రత్తలు